దాల్చిన చెక్క.. ఆహారానికి రుచితోపాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు.. అందాన్ని కాపాడటంలోనూ ముందుంటుంది. దాల్చిన చెక్కలోని యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి మైక్రోబయల్ లక్షణాలు.. మొటిమలు, ఇతర చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ముందుంటాయి. ఇందులోని పాలీఫెనాల్స్, యూజినాల్.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి.. కణాల నష్టాన్ని, వృద్ధాప్య ఛాయల్ని నివారిస్తాయి.