పొద్దున్నే పాటించే సహజమైన అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఉదయం పూట దినచర్యలో కొద్దిపాటి మార్పులతోనే స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ప్రభావం తగ్గించవచ్చు. అందుకోసం ఉదయం లేవగానే రెండు నిమిషాలపాటు ఊపిరితిత్తుల నిండుగా శ్వాస తీసుకుంటూ వదలాలి. లేవగానే చాయ్ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. చాయ్, కాఫీ తాగడం మానడం మంచిది.
ఒకవేళ తాగాలనుకున్నా.. మంచి నీళ్లు తీసుకున్న తర్వాతే తాగాలి. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రేక్ ఇవ్వొద్దు. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్, ఫ్యాటీ ఆమ్లాలు, అధిక పీచు ఉన్న పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ నియంత్రణలో ఉంటుందని నిపుణుల మాట.
శరీరంలో కొన్నిచోట్ల ఒత్తిడి చేస్తూ నాడులను ప్రేరేపిస్తే సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవతుందట. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఉదయం కష్టతరమైన వర్కవుట్స్ కాకుండా.. తేలికైన కసరత్తులు చేయడం ద్వారా ఎండార్ఫిన్ విడుదల అవుతుంది. సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్ విడుదల కావడం, ఒత్తిడికి గురిచేసే కార్టిసాల్‌ని నియంత్రించడం వల్ల ప్రతిరోజూ పండుగలా సాగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.