న్యూఢిల్లీ : ఉరుకుల పరుగుల బిజీ లైఫ్‌లో నిరంతర ఒత్తిడి (Health Tips) కారణంగా చాలా మంందిని నిస్సత్తువ, అలసట వెంటాడుతున్నాయి. ఆరోగ్య సమస్యలతో పాటు శారీరక వ్యాయామం కొరవడటం కూడా దీనికి తోడవుతోంది. నీరసం, అలసటను తక్షణమే మటుమాయం చేసే ఆహార పదార్ధాలతో రోజంతా ఉత్తేజంగా ఉండవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు రుజుత దివేకర్ చెబుతున్నారు. నిస్సత్తువను పారదోలేందుకు మూడు ఆహార పదార్ధాలను ఆమె ఇన్‌స్టా రీల్స్‌లో సజెస్ట్ చేశారు.
ఈ మూడు ఆహార పదార్ధాలను డైట్లో భాగం చేసుకుంటే అలసటను పారదోలి రోజంతా హుషారుగా గడపవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. వీటిలో ముందుగా గార్డెన్ క్రెస్ సీడ్స్ వండర్ సీడ్స్ అని రాసుకొచ్చారు. గార్డెన్ క్రెస్ ( లెపిడియం సాటివమ్ ) అనేవి క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలతో పాటు బ్రాసికేసి కుటుంబానికి చెందిన ఒక రకమైన విత్తనాలు. ఈ విత్తనాల్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి నిత్యం తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. దీంతో మెదడు సహా శరీరభాగాలన్నింటికీ రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ఫలితంగా మానసిక ప్రశాంతత చేకూరడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. ఇక శనగలు, పెసలు, ఉలవలు వంటి తృణధాన్యాలను 5-6 గంటల పాటు నీటిలో నానబెట్టి అవి మొలకెత్తిన తర్వాత తీసుకుంటే తక్షణమే శరీరానికి శక్తి సమకూరుతుంది. వీటిని సాయంత్రం స్నాక్స్ సమయంలో తీసుకోవచ్చు.
వీటిలో ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉండటంతో ఎనర్జీ అందడమే కాకుండా అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణాశయ సమస్యలూ దరిచేరవు. పప్పుధాన్యాలు, స్ప్రౌట్స్, బీన్స్‌ను వారానికి కనీసం నాలుగుసార్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక అలసటతో బాధపడేవారు రోజూ కొద్ది మోతాదులో జీడిపప్పు తీసుకుంటే మేలు. ఇందులో జీరో కొలెస్ట్రాల్‌తో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పదార్ధాలున్నాయి. మెగ్నీషియం దీనిలో అధికంగా ఉండటంతో నరాలు రిలాక్సేషన్‌కు ఉపకరిస్తుంది.
Read More
Bigg Boss 7 Telugu | బిగ్‌బాస్‌లో అబ్బాయిలు ఎలిమినేట్ అవ్వరా.. అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారా..?