Bigg Boss 7 Telugu | బిగ్‌బాస్‌లో అబ్బాయిలు ఎలిమినేట్ అవ్వరా.. అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారా..?
Bigg Boss 7 Telugu | అదేంటి అలా అంటారు.. ఎలిమినేషన్ ప్రాసెస్ ఓటింగ్ పద్ధతిలో ఉంటుంది కదా.. ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్లు ఎలిమినేట్ అవుతారు. అందులో బిగ్‌బాస్ చేతిలో ఏముందని అనుకోవచ్చు. కానీ జరుగుతున్న ఎలిమినేషన్స్ చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది.
Bigg Boss 7 Telugu | అదేంటి అలా అంటారు.. ఎలిమినేషన్ ప్రాసెస్ ఓటింగ్ పద్ధతిలో ఉంటుంది కదా.. ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్లు ఎలిమినేట్ అవుతారు. అందులో బిగ్‌బాస్ చేతిలో ఏముందని అనుకోవచ్చు. కానీ జరుగుతున్న ఎలిమినేషన్స్ చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఆరు సీజన్లలో ఒక్కసారి కూడా అమ్మాయిలు కప్పు గెలవలేదు. పైగా ప్రతి సీజన్లోనూ మొదటి రెండు మూడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అవుతుంటారు. ఈసారి ఏకంగా 4 వారాలు అమ్మాయిలే బయటికి వచ్చేశారు. ఈ వారం రతిక ఎలిమినేట్ కావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
మొదటివారం కిరణ్ రాథోడ్ బయటికి వచ్చింది.. ఆమె ఇంట్లో ఉన్నా పెద్దగా ఏం చేయలేదు.. పైగా మొత్తం ఇంగ్లీషులో మాట్లాడింది కాబట్టి ప్రేక్షకులు అర్థం కాక బయటికి పంపించారు అనుకోవచ్చు. ఇక రెండో వారం షకీలా బయటకు వచ్చింది. గతంలో కూడా హేమ, కరాటే కళ్యాణి, జ్యోతి లాంటి వాళ్లు ఒకటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యారు కాబట్టి.. షకీలా కూడా అదే బ్యాచ్ అని సర్దుకున్నారు. ఇక మూడో వారం సింగర్ దామిని ఎలిమినేట్ అయింది. హౌస్‌లో ఉన్నప్పుడు ఎక్స్ ట్రాలు బాగా చేసింది కాబట్టి ఎలిమినేట్ అవ్వక ఇంకేం అవుతుంది అంటూ ట్రోలింగ్ కూడా చేశారు. ఈ వారం చాలామంది డేంజర్ జోన్లో ఉన్నట్టు కనిపించారు.. కానీ కచ్చితంగా సేఫ్ అవుతుంది అనుకున్న రతిక ఎలిమినేట్ అయింది. ఆమె కంటే వీక్ కంటెస్టెంట్స్ ఇంట్లో చాలామంది ఉన్నారు.. కానీ కావాలనే రతికను ఎలిమినేట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రశ్నల వర్షం కురిపిస్తుందిప్పుడు.
ప్రతిసారి బిగ్ బాస్ సీజన్లో షాకింగ్ ఎలిమినేషన్స్ కామన్. ఈసారి కాస్త ముందుగానే అది జరిగింది. రతిక కచ్చితంగా మరో రెండు మూడు వారాలైనా ఉండాల్సిన కంటెస్టెంట్ అని.. ఇంట్లో ఏమి చేయకుండా కేవలం డ్రామాలు చేస్తున్న అమర్ దీప్, టేస్టీ తేజ లాంటి వాళ్లు ఆమె కంటే వీక్ అంటున్నారు ఫాన్స్. వాళ్లను కాదని రతికను ఎలిమినేట్ చేయడం ఏంటి అంటున్నారు. మరి నెక్స్ట్ వీక్ అయినా మేల్ కంటెస్టెంట్ బయటికి వస్తారా లేదంటే ఉన్న లేడీస్ లోనే ఇంకో నెంబర్ తగ్గుతుందేమో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

