e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఆరోగ్యం టైఫాయిడ్‌తో జాగ్రత్త!

టైఫాయిడ్‌తో జాగ్రత్త!

టైఫాయిడ్‌తో జాగ్రత్త!

రోజూ కాకపోయినా, రెండ్రోజులకోసారి అయినా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ఇలాంటప్పుడే ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ సీజన్‌లో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిలో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ అయిన టైఫాయిడ్‌తో మరింత జాగ్రత్తగా ఉండాలి. కలుషిత నీరు, పాలు, కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు టైఫాయిడ్‌ వస్తుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు దీని లక్షణాలు. ఇంకొందరిలో అల్సర్లు, పేగు ఇన్ఫెక్షన్లు కూడా కనిపిస్తాయి. టైఫాయిడ్‌లో గట్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించి, ఆకలిని మెల్లమెల్లగా తగ్గించేస్తుంది.

ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. శరీరానికి ఎప్పటికప్పుడు శక్తిని అందించాలి. పండ్లు, కూరగాయలు, కొబ్బరి నీళ్లు, జావ, గంజి వంటివి ఇవ్వాలి. ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే సత్తు పిండి, మొలకలు, గుడ్లు, చేపలు, చికెన్‌ డైట్‌లో చేర్చాలి. కానీ, ఏది తిన్నా తక్కువ మోతాదులోనే ఉండాలి. అలాగే ఆహారంలో మసాలాలు, కారాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నోటికి రుచి దూరమైతే నిమ్మరసం లేదా కీర, పుదీనా, సోంపు మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో వెన్న, రిఫైన్డ్‌ వెజిటెబుల్‌ ఆయిల్‌ వాడకాన్ని బాగా తగ్గించాలి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టైఫాయిడ్‌తో జాగ్రత్త!
టైఫాయిడ్‌తో జాగ్రత్త!
టైఫాయిడ్‌తో జాగ్రత్త!

ట్రెండింగ్‌

Advertisement