Work From Office | బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..!
Work From Office : ఉద్యోగులు చాలామంది ఆఫీస్‌లో దాదాపు పనిగంటలన్నీ కుర్చీల్లోనే గడిపేస్తుంటారు. లంచ్ బ్రేక్, టీ బ్రేక్ వంటి విరామాల్లో తప్ప ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు. దీంతో బరువు పెరిగే సమస్యను ఎదుర్కొంటారు.
Work From Office : ఉద్యోగులు చాలామంది ఆఫీస్‌లో దాదాపు పనిగంటలన్నీ కుర్చీల్లోనే గడిపేస్తుంటారు. లంచ్ బ్రేక్, టీ బ్రేక్ వంటి విరామాల్లో తప్ప ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు. దీంతో బరువు పెరిగే సమస్యను ఎదుర్కొంటారు. శారీరక శ్రమ లేకుండా అధిక క్యాలరీలు తీసుకుంటే అది శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు దారి తీస్తుంది. ఊబకాయం సహా పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారంతో పాటు జీవనశైలి మార్పులతో అధిక బరువు దరిచేరకుండా నిరోధించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఆఫీస్ నుంచి పనిచేస్తూనే ఫిట్నెస్ సాధించేందుకు ఏం చేయాలనే విషయంలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. ముఖ్యంగా ఆఫీస్‌కు వచ్చే ముందు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని దీంతో ఆకలితో అధికంగా చక్కెరతో కూడిన ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఉండే వీలుంది. ఇక ఉదయాన్నే ఛాయ్, కాఫీ, సిగరెట్లు వంటివి తీసుకోరాదని బదులుగా కొబ్బరి నీరు, షెర్బత్, పండ్లు తీసుకుంటే మేలని ఆమె సూచించారు.
తేలికపాటి ఆహారంతో రోజంతా అలసట, కడుపుబ్బరం, మందకొడితనం వేధించదని రుజుత దివేకర్ చెప్పుకొచ్చారు. లంచ్ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య వేరుశనగలు, మామిడి, బనానా వంటి ఆరోగ్యకర స్నాక్స్ తీసుకోవడం ఆపై 7 నుంచి 8 గంటల మధ్య తేలికపాటి ఆహారంతో డిన్నర్ ముగించడంతో పాటు కంటినిండా కునుకుతీయాలని ఆమె సూచిస్తున్నారు.దీంతో పాటు ఆఫీస్‌కు స్నాక్స్ కోసం తక్కువ క్యాలరీలు కలిగిన మఖానా, లెమన్ పెప్పర్ పాప్‌కార్న్, స్ప్రాట్ సాలడ్ వంటివి తీసుకెళ్లాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

