Redmi | రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లు.. ఇవీ డిటైల్స్..!
Redmi | గత జనవరిలో ఆవిష్కరించిన రెడ్ మీ నోట్ 13 సిరీస్ ఫోన్లపై అమెజాన్ లో రెడ్ మీ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.
Redmi | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ గత జనవరిలో రెడ్మీ నోట్ 13 5జీ సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. వాటిల్లో రెడ్మీ నోట్ 13 5జీ, రెడ్మీ నోట్ 13ప్రో 5జీ, రెడ్మీ నోట్ 13ప్రో+ 5జీ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే, 16-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తాయి. మూడు రంగులు, మూడు ర్యామ్ – మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తాయి. అయితే ఇప్పుడు రెడ్మీ తన రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లను డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది.
రెడ్మీ నోట్ 13 5జీ ఫోన్ 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు ఆవిష్కరించింది. అమెజాన్లో ఇప్పుడు డిస్కౌంట్ ధరలపై 6జీబీ ఆప్షన్ రూ.16,999, 8జీబీ ర్యామ్ ఆప్షన్ రూ.18,999, 12 జీబీ ర్యామ్ ఆప్షన్ రూ.20,999లకు లభిస్తాయి.
రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.25,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999లకు ఆవిష్కరించింది. ఇప్పుడు 6జీబీ ర్యామ్ ఆప్షన్ రూ.24,999, 8జీబీ ర్యామ్ ఆప్షన్ రూ.26,999, 12 జీబీ ర్యామ్ ఆప్షన్ రూ.28,999లకు లభిస్తాయి.
టాప్ హై ఎండ్ ఫోన్ రెడ్మీ నోట్ 13 ప్రో + 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.33,999, 12జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999లకు ఆవిష్కరించింది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.30,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.34,999లకు లభిస్తాయి.
ఇవీ స్పెషిఫికేషన్స్..
రెడ్మీ నోట్ 13 5జీ ఫోన్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్సెట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 108 మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా, 33వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
రెడ్మీ నోట్ 13 5జీ ఫోన్లో మాదిరే రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 13 ప్రో+ 5జీ ఫోన్లలోనూ డిస్ ప్లే, ఓఎస్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కెమెరా ఫీచర్లు ఒకటే. రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్, రెడ్మీ నోట్ 13 ప్రో+ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటాయి. రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ 67 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రెడ్మీ నోట్ 13ప్రో + 5జీ ఫోన్ 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 13 ప్రో+ 5జీ ఫోన్లు రెండింటిలోనూ 200-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

