Banana | అనేక పోషకాలతో నిండిన అరటిపండు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. వివిధ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఎనర్జీ బూస్టర్గానూ పనిచేస్తుంది. దీనిని రోజూ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటిపండు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. జీర్ణశక్తిని బలోపేతం చేయడంతోపాటు ఎముకల బలానికీ, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ముందు ఉంటుంది. బరువుతోపాటు రక్తంలో చక్కెరనూ నియంత్రణలో ఉంచుతుంది. అయితే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరటిపండు.. కొందరికి అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది.