e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News World Food Day : అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?

World Food Day : అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?

(World Food Day) మనందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణలే ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేళకు ఆహారం తినకపోవడం వల్ల రక్తహీనతతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆకలిని నిర్మూలించడంలో భారతదేశ పరిస్థితి పాకిస్తాన్, నేపాల్ కంటే దారుణంగా ఉన్నదని ఇటీవలి ఐక్యరాజ్య సమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 49 కోట్ల మంది మహిళలు ఆకలితోనే నిద్రపోతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.

మహిళలు సాధారణంగా పురుషులు తిన తర్వాతనే ఆహారం తీసుకుంటుంటారు. తాము ఎంత ఆకలిగా ఉన్నా కుటుంబం ఆకలిని తీర్చడంపైనే దృష్టిపెడుతుందే కానీ, తనకొచ్చే ఆరోగ్య సమస్యలను మాత్రం పట్టించుకోదన్నది నగ్నసత్యం. తరచుగా వారు ఆకలితో ఉంటారని, వారికి తగినంత పోషకాహారం లభించడం లేదని వివిధ సంస్థలు ఘోషిస్తున్నా.. మనం పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో, దేశంలో, ప్రపంచంలో చాలా ఆహారం వృధా అవుతున్నదని ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది.

మహిళల్లో రక్తహీనత సమస్య..

- Advertisement -

రాష్ట్ర ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, 2020 లో భారతదేశంలో దాదాపు 1.9 కోట్ల మందికి పౌష్టికాహారం లభించలేదు. అదే సమయంలో, రక్తహీనతతో బాధపడుతున్న 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళలు 51.4 శాతం ఉన్నారు. అంటే, మహిళలకు ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు కలిగిన ఆహారం అందడం లేదని అర్థం. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రకారం, ప్రపంచంలోని దాదాపు 8.1 కోట్ల మంది ఆకలితో ఉండి నిద్రపోతున్నారు. వీరిలో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. ప్రపంచంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో దాదాపు 20 శాతం మంది వారి వయస్సులో ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు కలిగి ఉన్నారు. మరోవైపు, చేదు వాస్తవం ఏంటంటే, ఏటా ప్రపంచవ్యాప్తంగా వినియోగించే మొత్తం ఆహారంలో మూడింట ఒక వంతు వృధా అవుతుంది. సరైన సమయంలో మార్కెట్‌కి రాకపోవడం, తెగులు కారణంగా ఏటా 40 శాతం పండ్లు, కూరగాయలు, 30 శాతం ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయంట.

ప్రపంచ ఆకలి సూచికలో..

ఐక్యరాజ్యసమితి ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలు మరింత పోషకాహార లోపంతో ఉన్నారు. 15-49 సంవత్సరాల వయస్సులో వారికి మంచి ఆహారం లభించని కారణంగా రుతుస్రావం, గర్భధారణ సమస్యలు ఎదుర్కొటున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 లో 116 దేశాల్లో భారతదేశం 101 వ స్థానంలో ఉన్నది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే వెనుకబడి ఉండటం విచారించదగిన.. అలాగే ఆలోచించాల్సిన విషయం.

ఇప్పుడేం చేయాలంటే..

మహిళలు ఐరన్‌ డెఫీషియెన్సీ, హిమగ్లోబిన్‌ వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిత్యం పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ఐరన్‌, సోడియం, పొటాషియం, ప్రోటీన్స్‌ అధికంగా ఉండే ఆహారాలు తినేలా ప్లాన్‌ చేసుకోవాలి. కుటుంబసభ్యులంతా కలిసి తినడం అలవాటుగా చేసుకోవాలి. అత్యధికంగా పోషకాలు లభించే పాలకూర, పన్నీర్‌, పాలు, క్యాబేజీ, ఉసిరి వంటివి ఎక్కువగా తినేలా చూసుకోవాలి. నిత్యం కనీసం ఒక్క పండు అయినా తినాలి. చిరుతిండ్లకు దూరంగా ఉండాలి. పరిశుభ్రమైన నీరు ఎక్కువగా తాగాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఎయిమ్స్‌ సీనియర్‌ వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగికదాడి

బాలీవుడ్‌ వృద్ధ బేగం ఫరూక్‌ జాఫర్‌ కన్నుమూత

చిన్నారులు అభిమానించే వాల్ట్‌ డిస్నీ ప్రారంభం

దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్‌‌..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement