Monkey Jack | రుచిలో గొప్పగా ఉండడంతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ పండు జాక్‌ఫ్రూట్ జాతికి చెందిందిగా భావిస్తారు. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ సీ, బీటా కెరోటిన్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు అంటాయి. ఆయుర్వేదంలోనూ ఈ పండును ఉపయోగిస్తారు. అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
బాదల్ ఫ్రూట్లో లభించే పోషకాలతో శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లోపాన్ని తొలగించి.. రక్తహీనతను నివారిస్తుంది. దాంతో పాటు ఇందులో జిక్, విటమిన్-సీ, బీటా కెరోటిన్ ఉండడంతో శరీరానికి శక్తిని ఇవ్వడంలో, అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.
బాదల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. బాదల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడంతో శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
మంకీ జాక్‌ఫ్రూట్ తింటే చర్మంతో పాటు జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్-సీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశంతంగా ఉంచుతాయి. చర్మం ముడతలను తగ్గిస్తాయి. జుట్టు రాలడం, సన్నబడడం వంటి సమస్యలను నివారిస్తాయి.
ఈ పండు మానసిక ఆరోగ్యానికి సైతం మేలు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది. అలాగే చిరాకును తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
బాదల్ ఫ్రూట్ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో సహాయపడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.