Health Benefits : దైనందిన జీవితంలో పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు సహా పలు ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాల వరకూ షుగర్ అనేది ఎన్నో ఆహారాల్లో సహజమైన సింపుల్ కార్బోహైడ్రేట్‌గా కనిపిస్తుంది. ఇక టేబుల్ షుగర్‌లో సుక్రోజ్, పండ్లలో ఫ్రక్టోజ్, పాల ఉత్పత్తుల్లో లాక్టోజ్ రూపంలో షుగర్‌ను తీసుకుంటాం. సహజంగా లభించే చక్కెరలతో కూడిన ఆహార పదార్ధాల్లో అవసరమైన పోషకాలు, ఫైబర్ ఉన్నప్పటికీ యాడెడ్ షుగర్స్ మాత్రం ఎలాంటి పోషక విలువలూ లేకుండా కేవలం అదనపు క్యాలరీలను కలిగిఉంటాయి.
యాడెడ్ షుగర్‌ను తీసుకోకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇక షుగర్‌ను తీసుకోవడం నిలిపివేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో ముఖ్యంగా చక్కెర తీసుకోకపోవడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ మెరుగవుతాయి. ఎనర్జీ లెవెల్స్ మెరుగై అలసట మటుమాయమై రోజంతా ఉత్సాహంగా పనిచేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇక షుగర్ తీసుకోవడం తగ్గిస్తే సరైన బరువును మెయింటైన్ చేసేందుకు వీలవుతుంది. అధిక బరువు పెరిగే ముప్పును నివారించవచ్చు. షుగర్‌ను పక్కనపెట్టడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
ఎనర్జీ లెవెల్స్ పెరుగుదల
అధిక బరువుకు చెక్
మెదడు ఆరోగ్యానికి మేలు
హృద్రోగ ముప్పు తక్కువ
చర్మం నిగారింపు
మెరుగైన జీర్ణక్రియ
క్యాన్సర్ ముప్పు నియంత్రణ
మధుమేహ ముప్పుకు చెక్
దంత సంరక్షణ
ఇమ్యూనిటీ
Read More :
Road Damage | గోషామహల్లో కుంగిన రోడ్డు..బోల్తా పడిన డీసీఎం : వీడియో