ఆదమరిస్తే అలర్జీ!
మన శరీర తత్వానికి సరిపడని పదార్థాలు తిన్నా, తాగినా, పీల్చినా, తాకినా.. మనకు సరిపోని ప్రాంతంలో ఎక్కువసేపు గడిపినా.. అలర్జీ రావచ్చు. కొన్ని పుష్పాల పుప్పొడి, ఫంగస్ కూడా కొందరికి ఇబ్బంది కలిగిస్తాయి.
అలర్జీ.. ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరిని ఇబ్బందిపెట్టే సమస్యే. బయటికి వెళ్లినప్పుడు కొందరికి దురద, దద్దుర్లు లాంటివి వస్తుంటాయి. మరికొందరిని అకారణంగానూ వేధిస్తుంటాయి. కాబట్టే, చికిత్స కోసం వైద్యుడి దగ్గరికి వెళ్లినప్పుడు.. ఏం తిన్నారన్నది ఆరా తీస్తారు. మీరు తీసుకున్న ఆహారంలోని ఏదో ఒక పదార్థం మీ శరీరానికి పడకపోయి ఉండొచ్చనే అంచనాకు వస్తారు. ఇలా, పడని పదార్థాలు లేదా మూలకాలు వివిధ అవయవాలలోకి ప్రవేశించినప్పుడు.. నిరసనగా మన శరీరం చూపించే ప్రతి చర్యనే అలర్జీ అంటారు. కొందరికి పుట్టుకతో అలర్జీలు వస్తాయి. అసలు అలర్జీలకు కారణాలేంటి? ఎన్ని రకాలు? వాటి లక్షణాలేంటి? .. ఈ వారం ‘ఊపిరి’లో తెలుసుకుందాం.
మన శరీర తత్వానికి సరిపడని పదార్థాలు తిన్నా, తాగినా, పీల్చినా, తాకినా.. మనకు సరిపోని ప్రాంతంలో ఎక్కువసేపు గడిపినా.. అలర్జీ రావచ్చు. కొన్ని పుష్పాల పుప్పొడి, ఫంగస్ కూడా కొందరికి ఇబ్బంది కలిగిస్తాయి. నూటికి 35శాతం మందిలో.. ఈ పడని పదార్థ్ధాలు శరీరంలోకి వెళ్లి మలమూత్ర విసర్జన ద్వారా బయటికి రాకుండా.. రక్తంలో కలిసిపోతాయి. దీనివల్ల శరీరం లోపల గాయాలు, పుండ్లు ఏర్పడతాయి. వైద్య పరిభాషలో ఇదే.. అలర్జీ. ఈ మార్పు అవయవంలోని ఏ భాగంలో ఏర్పడితే.. ఆ భాగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఊపిరితిత్తుల్లోకి పోతే దగ్గు, చర్మంపై సోకితే దురద, ముక్కులోకి దూరితే తుమ్ములు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
అలర్జిక్ మార్చ్, అటోపిక్ మార్చ్ ..
తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి ఈ సమస్య ఉన్నా పుట్టబోయే బిడ్డకు అలర్జీ వచ్చే ఆస్కారం 50 శాతం వరకూ ఉంది. ఇద్దరికీ ఉంటే 70 శాతం మేర ఉంటుంది. అలా పుట్టిన పిల్లలు ఐదు నుంచి పదేండ్ల లోపు కానీ, పదిహేను నుంచి ఇరవై ఏండ్ల లోపు కానీ.. అలర్జీలకు గురికావచ్చు. వీటినే ‘చైల్డ్హుడ్ అలర్జీస్’ అంటారు. కొంతమందికి బాల్యంలో ఎలాంటి అలర్జీలు లేకపోయినా.. 40 నుంచి 60 ఏండ్ల వయసులో బయట పడవచ్చు. చిన్నప్పుడే బిడ్డలో అలర్జీ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేస్తారు కొందరు. సరైన చికిత్స అందించకుండా తాత్కాలిక ఉపశమనం కోసం మందులు,
ఇన్హేలర్స్ వాడితే.. పెద్దగా లాభం ఉండదు. అంతేకాదు, అలర్జీ తాలూకు గాయం ఒక అవయవం నుంచి మరో అవయవానికి వ్యాపిస్తుంది. కొన్ని రోజుల తరువాత సైనసైటిస్గా స్థిరపడే ఆస్కారం ఉంది. ఇలా ఒక అవయవం నుంచి మరో అవయవానికి అలర్జీ మారడాన్ని ‘అలర్జిక్ మార్చ్ లేదా అటోపిక్ మార్చ్’ అంటారు.
7 నుంచి 9 రకాలు
ఆయా అవయవాలపై చూపే ప్రభావం ఆధారంగా అలర్జీలు ఏడు నుంచి తొమ్మిది రకాలు. అందులోనూ ఎక్కువగా కనిపించేవి ఐదు రకాల అలర్జీలే. ఆ లక్షణాలను గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. నిర్లక్ష్యం చేసినకొద్దీ ఇబ్బందే. చిట్కా వైద్యాలను నమ్ముకుంటే బాధపడాల్సి వస్తుంది.

1. అలర్జిక్ ఆస్తమా- ఉబ్బసం
అలర్జిక్ ఆస్తమా ఊపిరితిత్తులకు అలర్జీ రావడం వల్ల సోకుతుంది. దీనివల్ల రోగి శ్వాస సంబంధ సమస్యను ఎదుర్కొంటాడు.
లక్షణాలు
- పొడి దగ్గు.
- దగ్గుతో పాటు తెమడ పడటం.
- ఆయాసం.
- ఛాతీ బరువుగా ఉండటం.
- గొంతులో దురదగా అనిపించడం.
నిర్ధారణ పద్ధతులు
1. గ్లోబల్ గోల్డ్ స్టాండర్డ్ అలర్జ్జీ స్కిన్ టెస్టింగ్ చాలాచోట్ల అందుబాటులో ఉన్నది. దీనిద్వారా రెండేండ్ల చిన్నారి నుంచి ఎనభై ఏండ్ల వారి వరకూ.. ఎవరికైనా పరీక్షలు చేయవచ్చు.
2. ఫాడియో టాప్ బ్లడ్ మెథడ్….దీని ద్వారా కూడా అలర్జీ నిర్ధారణ చేయవచ్చు. సుమారు 180 రకాల అలర్జన్స్, 100 ఆహార పదార్థాలు, 80 పర్యావరణ పదార్థాలను ఈ రెండు పద్ధతుల్లో పరీక్షించవచ్చు. అరగంటసేపు జరిగే ఈ పరీక్ష అనంతరం రోగికి ఎలాంటి ఆహార పదార్థాలు పడటం లేదు, ఎలాంటి పర్యావరణ పరిస్థితులు సరిపోవడం లేదు అన్నది తెలిసిపోతుంది.
2. అలర్జిక్ రైనైటిస్
అలర్జిక్ రైనైటిస్.. అలర్జీ ముక్కులోకి విస్తరిం చడం వల్ల వస్తుంది.
లక్షణాలు
- ముక్కులో దురద.
- ఎక్కువగా తుమ్ములు.
- ముక్కు కారడం.

3. అలర్జిక్ సైనసైటిస్
అలర్జిక్ సైనసైటిస్ అనేది.. ముఖ భాగంలో ఉన్న ఎముక రంధ్రాలలో అలర్జీ కేంద్రీకృతమైనప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఎముక లోపల నీళ్లు ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి.. మొదట పచ్చని చీముగా, తరువాత చిక్కటి చీముగా మారి జిగురులా ఉండిపోతుంది.
లక్షణాలు
- తీవ్రమైన తలనొప్పి.
- కళ్లు లాగడం.
- చికాకు పెరగడం.
- ఫోకస్ తగ్గడం.
4. అలర్జిక్ అర్టికేరియా
చర్మం అలర్జీకి ఇది మరో పేరు.
లక్షణాలు
- చర్మం ఎండిపోవడం.
- ఆ తరువాత దురద ఏర్పడటం.
- దద్దుర్లుగా మారడం.
- సమస్య తీవ్రమైనప్పుడు పెదవులు వాచిపోవడం.
- ముఖం వాచిపోవడం.
- మర్మావయవాలు వాచిపోవడం.
అప్పటికీ చికిత్స తీసుకోకపోతే అనాఫలాక్సిస్ అనే ప్రాణాంతకమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనాఫలాక్సిస్ తీవ్రమైన అలర్జీ. ఐదు నిమిషాల్లోపు చికిత్స అందకపోతే రోగి మృత్యువాత పడవచ్చు. ఇది నూటికి 1-2శాతం మందికి ఉండే అవకాశం ఉంది. సాధారణ అలర్జీలను నిర్లక్ష్యం చేస్తే కనుక.. అవి తీవ్ర రూపం ధరించి అనాఫలాక్సిస్ దశకు చేరుకునే ఆస్కారం ఎక్కువ. అంతవరకూ రాకుండా జాగ్రత్తపడాలి. నిపుణు లైన వైద్యులను సంప్రదించాలి.
5. అలర్జిక్ కోలైటిస్
పేగుల్లో అలర్జీ కేంద్రీకృతం కావడం వల్ల అలర్జిక్ కొలైటిస్ ఏర్పడుతుంది.
లక్షణాలు
- తీవ్రమైన కడుపు నొప్పి.
- తిన్న వెంటనే కడుపు నొప్పి.
- కడుపు ఉబ్బరం
- ఆకలి మంద గించిపోవడం.
..ఇలాంటి వ్యాధులను ఎండోస్కోపి పరీక్ష ద్వారా కూడా మనం గుర్తించలేం.
ప్రధాన కారకాలు..
హౌజ్ డస్ట్ మైట్ – కంటికి కనపడని 8 కాళ్ల సూక్ష్మక్రిమి..70 నుంచి 80శాతం మందికి అలర్జీలు రావడానికి ఇదే కారణం. పార్థీనియం-వయ్యారి భామ మొక్క పుప్పొడి సుమారు 50-60 శాతం అలర్జీలకు మూలం.
బొద్దింకలు-బొద్దింకల విసర్జన వలన 30-40శాతం ఆస్తమా రోగులు అలర్జిక్ రైనైటిస్ వంటి రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. ఆల్టర్నేరియా-ఇది ఫంగస్ జాతికి చెందినది. సుమారు 50 నుంచి 60 శాతం అలర్జీలు దీనివల్ల వచ్చే అవకాశం ఉంటుంది.
చికిత్స విధానం
అలర్జన్స్ స్పెసిఫిక్ సబ్లింగ్వల్ ఇమ్యునో థెరపీ ఐదేండ్ల లోపు నుంచి ఎనభై ఏండ్ల వారికి అలర్జీ నిర్ధారణ ఆధారంగా నాలుక కింద రెండు చుక్కలు వేసి.. రెండేండ్ల వరకు చికిత్స అందిస్తే 50-60శాతం అలర్జీలు తగ్గే అవకాశం ఉంది.
యాంటీ ఐజీఈ థెరపీ
ఆస్తమా తీవ్రంగా ఉన్నవారికి లేదా అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ అర్టికేరియా ఉన్నవారికి, రక్తంలో సీరం ఐజీఈ అలర్జీ శాతం ఎక్కువ ఉన్నవారికి ఇంజక్షన్ రూపంలో ఇస్తారు.
ఔషధాలు
అలర్జీల ఆధారంగా రోగికి అవసరమైన మందులను ఏడాది కాలంపాటు ఇవ్వడం జరుగుతుంది.
కరోనా వ్యాక్సిన్ వల్ల
2020 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో.. అలర్జీ ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం మంచిదని సూచించారు. దీనివల్ల కొందరిలో ఆయా అలర్జీలు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉన్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కొవిడ్ తీవ్రతకు గురైనవారిలో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారే అధికం. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారంతో, ఆరోగ్యకర జీవనశైలితో, అప్రమత్తతతో.. అన్నిటికీ మించి మంచి వైద్యంతో ఈ రుగ్మతను తేలికగా అధిగమించవచ్చు.
…?మహేశ్వర్రావు బండారి
– డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ పల్మనాలజిస్ట్, అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ అశ్విని అలర్జీ సెంటర్, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

