CSK vs LSG | కార్తిక్ మెరుపు హాఫ్ సెంచరీ.. చెన్నైకి లక్నో షాకిస్తుందా..!
CSK vs LSG : ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్‌తో లక్నో సూపర్ జయింట్స్కు సవాల్ విసిరింది. ఆకాశ్ సింగ్(3-26) ధాటికి టాపార్డర్ విఫలమైనా కుర్రాడు కార్తిక్ శర్మ(71) మెరుపు అర్ధ శతకంతో లక్నో బౌలర్లను బెంబేలెత్తించాడు.
CSK vs LSG : ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) భారీ స్కోర్‌తో లక్నో సూపర్ జయింట్స్ (LSG)కు సవాల్ విసిరింది. ఆకాశ్ సింగ్(3-26) ధాటికి టాపార్డర్ విఫలమైనా కుర్రాడు కార్తిక్ శర్మ(71) మెరుపు అర్ధ శతకంతో లక్నో బౌలర్లను బెంబేలెత్తించాడు. ప్రధాన ఆటగాళ్లు ఔటైనా ఒత్తిడిలోనూ గొప్ప ఇన్నింగ్స్ ఆడిన కార్తిక్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. ఆఖర్లో శివం దూబే(32 నాటౌట్) ధనాధన్ ఆడడంతో స్కోర్ 180 దాటింది. ప్రిన్స్ యాదవ్‌ను ఉతికేస్తూ 6, 4, ,4, 6తో దూబే రెచ్చిపోగా సీఎస్కే నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి రన్స్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. కొత్త బంతితో నిప్పులు చెరిగిన లక్నో పేసర్ ఆకాశ్ సింగ్(3-26) వరస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. తొలుత రుతురాజ్ గైక్వాడ్(13)ను.. శాంసన్(20)ను ఔట్ చేసి చెన్నైకి షాకిచ్చాడు. పవర్ ప్లే తర్వాత ఉర్విల్ పటేల్(6)ను సైతం వెనక్కి పంపిన ఆకాశ్ మూడో వికెట్ సాధించాడు. ఆ తర్వాత వచ్చిన కార్తిక్ శర్మ(71) విధ్వంసక ఆటతో లక్నో బౌలర్లకు దడ పుట్టించాడు.
𝗞𝗮𝗿-𝘃𝗶𝗻𝗴 the gaps in style 👌
Kartik Sharma brings up his 2️⃣nd #TATAIPL Fifty 👏
Updates ▶️ https://t.co/v1R8RJXPe8#KhelBindaas | #LSGvCSK | @ChennaiIPL pic.twitter.com/uZzX5LEUhh
— IndianPremierLeague (@IPL) May 15, 2026
అప్పటిదాకా నత్తనడకలా సాగిన ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చిన కార్తిక్ బౌండరీలతో అలరించాడు. డెవాల్డ్ బ్రెవిస్(25), శివం దూబే(32 నాటౌట్)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అర్ధ శతకం అయ్యాక మరింత రెచ్చిపోతూ.. షాబ్ ఓవర్లో వరసగా 6, 4, 4 బాదిన ఈ కుర్రాడు మరో షాట్ ఆడి మర్క్రమ్ చేతికి చిక్కాడు. అనంతరం ప్రశాంత్ వీర్(13 నాటౌట్) జతగా దూబే చెలరేగాడు. ప్రిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో దూబే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదడంతో లక్నో ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది చెన్నై.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

