Ishan Kishan : భారత యువకెరటం ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు భారీ నగదు ప్రోత్సాహం లభించింది. అంతర్జాతీయ టీ20ల్లో అదరగొడుతున్న ఈ చిచ్చరపిడుగును సొంత రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటితో ఘనంగా సత్కరించింది. ఐపీఎల్ సమయంలో ఉన్నట్టుండి ఇషాన్‌కు ఇంత మొత్తం ఎందుకిచ్చారో తెలుసా.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించినందుకు.
స్వదేశంలో భారత జట్టు సగర్వంగా టీ20 ప్రపంచకప్‌ను గెలుపొందడంలో భాగమైన ఇషాన్ కిషన్ భారీ కానుక అందుకున్నాడు. పాట్నాకు చెందిన ఇషాన్‌ను బిహార్ ప్రభుత్వం రూ.1 కోటి బహూకరించింది. శుక్రవారం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ చేతుల మీదుగా ఇషాన్ కోటి రూపాయల చెక్కును అందుకున్నాడు. ఈ సందర్భంగా పాకెట్ డైనమైట్ను సీఎం అభినందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశాడీ ఓపెనర్.
Bihar Chief Minister Samrat Choudhary on Friday presented a cheque of ₹1 crore to Indian cricketer Ishan Kishan in recognition of his contribution to India’s victorious T20 World Cup 2026 campaign.#IshanKishan #T20WorldCup #SamratChoudhary #TeamIndia #Bihar #ITPhotoblog pic.twitter.com/mGbWZA4uQ3
— IndiaToday (@IndiaToday) May 15, 2026
పొట్టి వరల్డ్‌కప్‌లో ఇషాన్ 193.29 స్ట్రయిక్ రేటుతో 317 రన్స్ కొట్టాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. కొలంబోలో పాకిస్థాన్‌పై మిగతా వాళ్లు తడబడినా.. ఈ డాషింగ్ బ్యాటర్ 40 బంతుల్లోనే 77 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకమయ్యాడు.