POCSO : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కానిస్టేబుల్కు పోక్సో(POCSO) ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కానిస్టేబుల్ వరదరాజ్ సుదేశ్కు జైలు శిక్ష వేస్తూ తీర్పు నిచ్చింది.
పోక్సో స్పెషల్ కోర్టు శుక్రవారం విచారణలో వరదరాజ్పై అత్యాచారం, పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాదు నిందితుడికి రూ.12 వేల జరిమానా వేసింది కోర్టు. అలానే బాధిత బాలికకు రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.