Hyderabad | నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. హైదరాబాద్–జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
Hyderabad : హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్–జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
Hyderabad : హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్–జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. రెండు ఏసీ కోచుల్లో మంటలు చెలరేగాయి. బీ1, బీ2 ఏసీ కోచుల్లో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అయితే, ఆలోపే రెండు కోచులు చాలావరకు దగ్ధమయ్యాయి. అయినప్పటికీ మంటలు ఇతర కోచులకు వ్యాపించకుండా సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. రైలు బయల్దేరడానికి కొద్ది సేపటి ముందు ఈ ప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. నాంపల్లి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న హైదరాబాద్–జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సాయంత్రం 6.45 గంటలకు మంటలు చెలరేగాయి. బీ1, బీ2 అనే టైర్–3 ఏసీ కోచుల్లో ఈ మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. ఎవరూ గాయపడలేదు. అగ్నిప్రమాద సమయంలో కోచులలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సాయంత్రం 7.50 గంటలకు రైలు బయల్దేరాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గురైన కోచులను రైలు నుంచి విడదీశారు. వాటిని పరిశీలించి అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోనున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో స్టేషన్‌లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

