ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Jul 27, 2020 , 23:21:26

అలర్జీలు ఆడవాళ్లకే ఎక్కువా?!

అలర్జీలు ఆడవాళ్లకే ఎక్కువా?!

ఏమాత్రం చల్లని వాతావరణం ఉన్నా అలర్జీ, ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నవారి బాధ వర్ణనాతీతం. సహజంగానే ఆడవాళ్లలో అలర్జీలు అధికంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మరో విషయమూ చెబుతున్నారు సైంటిస్టులు. పురుషులతో పోలిస్తే మహిళలే ఆస్తమా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు. అమెరికాలోని వాండెర్‌బిల్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు యుక్తవయసు దాటినవారిలో.. పురుషుల్లో కన్నా ఆడవాళ్లలో ఆస్తమా ఎక్కువగా కనిపిస్తున్నట్టు గుర్తించారు. అయితే మెనోపాజ్‌ దాటిన మహిళల్లో మాత్రం ఆస్తమా తక్కువగా ఉంటుందంటున్నారు. అంటే ఆస్తమా వ్యాధి కారకాలపై లైంగిక హార్మోన్ల ప్రభావం ఉంటుందన్నమాట. ఈ అంశం గురించి ఎలుకలపై పరిశోధనలు జరిపి నిర్ధారణ చేశారు. అందుకే, నెలసరి ప్రారంభమైన ఆడపిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. 


logo