శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jul 13, 2020 , 23:27:11

నొప్పి గుట్టు తెలిసింది!

నొప్పి గుట్టు తెలిసింది!

చిన్న నొప్పికే విలవిలలాడతారు కొందరు. ఎంత పెద్ద దెబ్బ తగిలినా చిరునవ్వుతో ఉండగలరు మరికొందరు. ఇలాంటి వైరుధ్యానికి మూలకారణం మన జన్యువుల్లోనే దాగివుందంటున్నారు పరిశోధకులు. 

మనకు నొప్పి తెలియాలంటే కొన్ని రకాల రసాయనాలు మెదడులో ఉత్పత్తి కావాలి. ఇందుకు దోహదం చేసేవి బిహెచ్‌4 జన్యువులు. అయితే బిహెచ్‌1 జన్యువు అనేది బిహెచ్‌4 జన్యువు చర్యలను నియంత్రిస్తుంది. ఈ రకమైన జన్యువులున్నవారిలో మెదడులోని రసాయనాల ఉత్పత్తి తగ్గి, నొప్పి తెలియకుండా పోతుంది. తీవ్రమైన ప్రమాదాలకు లోనైనవారిలో సహజంగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఈ బిహెచ్‌4 జన్యువు చర్యలు ఎక్కువగా ఉంటే నొప్పి భరించలేనంతగా ఉంటుంది. నొప్పికి కారణమైన జన్యుమూలాలను కనుగొనడం సాధ్యమైంది కాబట్టి, పెయిన్‌ ట్రీట్‌మెంట్‌లో మరో ముందడుగు పడ్డట్టే. పెయిన్‌ కిల్లర్ల అవసరం లేకుండానే నొప్పి నుంచి ఉపశమనం కలిగించే కొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.


logo