-1215లో ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ మొదటిసారిగా హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వకమైన ప్రకటన చేశాడు. దీన్నే మాగ్నాకార్టా అని అంటారు.
-1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది.
-భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రకరణ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
-ప్రాథమిక హక్కులకు మరో పేరు న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు.
-ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగకర్తలు అమెరికా నుంచి స్వీకరించారు.
-అమెరికాలో వీటని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు.
-ప్రాథమిక హక్కులకు సంబంధించి 1927లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ సమావేశం మొదటిసారిగా తీర్మానం చేశారు.
-రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కులపై సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఒక ఉపకమిటీ ఏర్పాటయ్యింది.
-ప్రాథమిక హక్కులకు న్యాయసంరక్షణ, వీటి అమలుకు నేరుగా సుప్రీంకోర్టును ప్రకరణ 32 ప్రకారం, ప్రకరణ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించవచ్చు.
-ప్రకరణ 12లో రాజ్య నిర్వచనం ఉంది.
-రాజ్యం అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అలాగే అన్ని ప్రభుత్వ సంస్థలు వస్తాయి.
-ప్రకరణ 13లో చట్ట నిర్వచనం ఉంది.
-చట్టం అంటే కేంద్ర, రాష్ట్ర శాసనాలు, రాష్ట్రపతి, గవర్నర్ల ఆర్డినెన్స్‌లు, ప్రభుత్వ నోటిఫికేషన్లు మొదలైనవి. అయితే 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణ 13 ప్రకారం చట్టపరిధిలోకి రాదు.
-సాధారణ చట్టాల ద్వారా ప్రాథమిక హక్కులను సవరించడానికి వీలులేదు. రాజ్యాంగ సవరణ ద్వారానే సవరించాలి.
-ప్రకరణ 13లో న్యాయ సమీక్ష అధికారాన్ని ప్రస్తావించారు. అయితే న్యాయసమీక్ష అనే పదం రాజ్యాంగంలో లేదు.