న్యూయార్క్ : డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మునిగితేలడం ఎంత ప్రమోదమో ఎన్నో ఘటనలు కండ్ల ముందు కన్పిస్తున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా ఓ సైక్లిస్ట్ ఫోన్లో బిజీగా ఉండి రోడ్డు పక్కన పార్క్ చేసిన వ్యాన్‌ను ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికన్ బాస్కెట్‌బాట్ మాజీ ప్లేయర్ రెక్స్ చప్మన్ ట్విటర్లో ‘డోంట్ టెక్ట్స్ అండ్ బైక్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో సైక్లిస్ట్ సైకిల్ తొక్కుతూ ఫోన్ చూడటంలో మునిగిపోయాడు. ఫోన్‌ను చూస్తూ అతడు నేరుగా రోడ్డు పక్కన పార్క్ చేసిన వ్యాన్‌ను ఢీకొట్టడం కనిపించింది. దీంతో సైకిల్ కిందపడిపోగా సైక్లిస్ట్ ముఖం వ్యాన్‌కు బలంగా తాకింది. సైక్లిస్ట్ తన ముఖాన్ని తడుముకుంటూ తనను ఎవరైనా గమనించారా అని చుట్టుపక్కల పరికించడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను పది లక్షల మంది పైగా చూడగా, 29,000కు పైగా లైక్స్ వచ్చాయి.
Don’t text and bike… https://t.co/ejg8DrySSS
— Rex Chapman🏇🏼 (@RexChapman) April 7, 2021