సోమవారం 01 మార్చి 2021
Gadwal - Feb 11, 2021 , 00:13:48

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

  • అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

అయిజ, ఫిబ్రవరి 10 : మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపాలిటీలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో జరుగుతున్న బీటీ రోడ్డు, సమీకృత మార్కెట్‌, వైకుంఠ ధామం పనులను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. మున్సిపాలిటీలో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ కృష్ణమూర్తిని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చూడాలని ఏఈకి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిన్నదేవన్న, కమిషనర్‌ వేణుగోపాల్‌, ఏఈ గోపాల్‌, కాంట్రాక్టర్‌ కృష్ణమూర్తి ఉన్నారు. 

ఎంపీడీవో కార్యాలయం తనిఖీ

మల్దకల్‌, ఫిబ్రవరి 10 :  మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల వివరాలను సీనియర్‌ అసిస్టెంట్‌  సూర్యప్రకాశ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ నర్సింహులు తదితరులు ఉన్నారు.


VIDEOS

logo