అర్హులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి

- కలెక్టర్ శృతిఓఝా
గద్వాల,జనవరి25: జిల్లాలో 18 ఏండ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ శృతిఓఝా పిలుపు నిచ్చారు. సోమవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కులం, మతం, వర్గం, భాష ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. మైదానంలో కుర్చీల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైదానంలో లైటింగ్, తాగునీటి సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, ఏవో భద్రప్ప, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ రాములు పాల్గొన్నారు.
ప్రజావాణికి 66 ఫిర్యాదులు
ప్రజావాణికి సోమవారం 66 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ శృతిఓఝా తెలిపారు. వాట్సాప్ ద్వారా 3, బాక్స్ ద్వారా 63 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు.
తాజావార్తలు
- తమిళనాడులో మార్చి 31వరకు లాక్డౌన్ పొడిగింపు
- వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
- పార్టీ పెట్టే ఆలోచన లేదని సంకేతాలిచ్చిన ట్రంప్
- కార్లతో కిక్కిరిసిన ఎన్‌హెచ్ 44
- భారత విద్యుత్ వ్యవస్థపై చైనా సైబర్ దాడి
- ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
- కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!