బుధవారం 21 అక్టోబర్ 2020
Gadwal - Sep 27, 2020 , 06:47:24

విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి

విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి

  •  అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

గద్వాల : ఈనెల 30న జరిగే జూనియర్‌ రెసిడెన్సియల్‌ డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా మా స్కులు ధరించాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శనివారం తన చాంబర్‌లో ఆర్‌జేసీ, ఆర్డీపీ’(రెసిడెన్షియల్‌ జూనియర్‌, రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల) ప్రవేశ పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రవేశ పరీక్ష జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని, కొవిడ్‌ సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చా రు. జిల్లా కేంద్రంలో మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష ఉదయం 10గంటల నుంచి మ ధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహిస్త్తారని పరీక్షా కేంద్రానికి విద్యార్థులు సకాలంలో చేరుకోవాలన్నారు.

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి సంబంధిత రూట్లలో ఆర్టీసీ బస్సులు సకాలంలో నడిచే విధంగా చూడాలని ఆర్టీసీ డీఎం కు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిరంతర విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులకు థర్మల్‌ స్కానింగ్‌ చేసి లోపలికి పంపించే విధంగా పారామెడికల్‌ సిబ్బందిని ప్రతి  సెంటర్‌లో ఉంచాలని అదే విధంగా ప్రాథమిక వైద్య కిట్లు అందుబాటులో ఉంచాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక పోలీస్‌ను ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖకు సూచించారు. సమావేశంలో ప్రవేశ పరీక్షల నోడల్‌ అధికారి చిన్నయ్య నాయుడు, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ శశికళతో పాటు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.logo