శనివారం 27 ఫిబ్రవరి 2021
Gadwal - Aug 30, 2020 , 04:38:31

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెద్దమందడి : వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మోటర్‌ సైకిల్‌ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రా మ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మన్నెం (45) శనివారం రాత్రి తన వ్యవసాయ పొలం నుంచి పనులను ముగించుకొని ఇంటికి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి మోటర్‌ సైకిల్‌ ఢీకొట్టడంతో మన్నెం అక్కడిక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

VIDEOS

logo