బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Jan 25, 2020 , 00:56:57

క్షణక్షణం ఉత్కంఠ

క్షణక్షణం ఉత్కంఠ
  • -నేడే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు
  • - ఉదయం 8గంటల నుంచి ప్రారంభం
  • -జిల్లాలో 4 కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  • -76 వార్డుల ఓట్లు 12హాళ్లలో లెక్కింపు
  • - లెక్కింపు కోసం 291మంది సిబ్బంది
  • -ఆసక్తిగా ప్రజల ఎదురుచూపులు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చే 5ఏళ్ల పాటు బల్దియాలను పాలించే నాయకులెవరనే భవితవ్యం నేడు తేల నుంది. ఆధ్యంతం పో టాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో పైచేయి సాధించే పార్టీ యేదని ఫలితాలు వెలువడనున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు చేపట్టే కౌం టింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేయను న్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుం డా కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటుచేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను నియమించేందుకు ఏర్పాట్లను చేపట్టనున్నారు.

4మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు

జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఉదయం 8గంటల నుంచి ప్రారంభించనున్నారు. గద్వాలలో పాలిటెక్నిక్‌ కళాశాలలో, అయిజలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, అలంపూర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, వడ్డేపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌం టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించనున్నారు గద్వాలలో మొత్తం 59,498 ఓట్లకు గాను 44,086 ఓట్లు పోలవ్వగా, అయిజలో 20,082 మంది ఓటర్లుండగా పోలింగ్‌లో 17,483 ఓట్లు పోలయ్యాయి. అలంపూర్‌లో 8,089 మంది ఓటర్లుండగా పోలింగ్‌లో 6,474 మంది పాల్గొన్నారు.  వడ్డేపల్లిలో 9,575 మంది ఓటర్లుండగా 8,066 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్‌ కేంద్రాల్లో మొదటగా పోలైన ఓట్లలో గుర్తుల వారీగా వేరుచేసి 100 చొప్పున ఓట్లను జతచేయనున్నారు. అనంతరం జతచేసిన ఓట్లను పార్టీల వారీగా లెక్కించి ఏ వార్డులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని ప్రకటించ నున్నారు. మెజారిటీ ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. అధికారుల అంచనా ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ముగించే అవకా శాలున్నాయి.

12 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాట్లు

ఎన్నికల నిర్వహించిన 76 వార్డులకు చెందిన ఓట్లను లెక్కించేందుకు ఎన్నికల అధికారులు 4కౌంటింగ్‌ కేంద్రాల్లో మొ త్తం 12 కౌంటింగ్‌ హాళ్లలను ఏర్పాటు చేశారు. గద్వాలలో 37 వార్డులకోసం ఏర్పాటు చేసిన  75 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లను 5 కౌంటింగ్‌ కేంద్రాల్లో లె క్కించనున్నారు. అయిజలోని 20 వా ర్డుల కోసం ఏర్పాటు చేసిన 40 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లను 3 కౌంటింగ్‌ హాళ్లలో  లెక్కించనున్నారు. అలంపూర్‌ లో 9వార్డుల కోసం ఏర్పాటు చేసిన 18 పోలింగ్‌ కేంద్రాల్లోని ఓట్లను లెక్కించేందుకు రెండు కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేశారు. వడ్డేపల్లిలో 10వార్డుల కోసం ఏర్పాటు చేసిన 19పోలింగ్‌ కేంద్రాలోని ఓట్లను లెక్కించేందుకు రెండు కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌కు 291 మంది సిబ్బంది

ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సం ఘం 291 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. వీరిలో కౌంటింగ్‌ సూపర్‌ వై జర్స్‌ 92 మంది, కౌంటింగ్‌ అసిస్టెంట్స్‌ 183 మంది, మైక్రో అబ్జర్వర్స్‌ 16 మం దిని నియమించారు. వీరందరూ 76 టేబులల్లో ఏర్పాటు చేసిన ఓట్లను లెక్కించనున్నారు. మున్సిపాలిటీల వారీగా గ ద్వాలలో 140 మంది, అయిజలో 76 మంది, అలంపూర్‌లో 36 మంది,  వడ్డేపల్లిలో  39 మంది అధికారులను ఏర్పా టు చేశారు. వీరందరితో పాటు పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్‌ ఉం డేందుకు అన్ని కౌంటింగ్‌ హాళ్లలో వీడియోగ్రఫీ, వెబ్‌కాసింగ్‌లను ఏర్పాటు చేశారు.

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించడంతో పురప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాము ఓటు వేసిన అభ్యర్థి విన్నర్‌గా నిలుస్తారా లేక రన్నర్‌గా నిలుస్తారనని వేచి చూస్తున్నారు. మున్సిపల్‌ పీఠంపై జెండా ఎగురవేసేది ఏ పార్టీ నాయకులను అత్రుతగా ఎదరుచూస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం దాదాపుగా మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కౌన్సిలర్లుగా విజయఢంకాను మోగించేది ఎవరన్న అంశాలు వెలువడనున్నాయి. పుర పీఠాలు ఏ పార్టీ దక్కించుకోనుందన్న అంశాలపై పందెలు జోరుగా జరుగుతున్నాయి.
logo