శుక్రవారం 15 జనవరి 2021
Food - Jul 27, 2020 , 20:13:42

రోగనిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే వీటిని ఆహారంలో చేర్చుకోవాలి!

రోగనిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే వీటిని ఆహారంలో చేర్చుకోవాలి!

క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తి అధికంగా ఉండాలి. శ‌క్తి ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెరిగేందుకు విట‌మిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినాల‌ని సూచించేవాళ్లు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన మేర‌కు విట‌మిన్ బి అధికంగా ఉండే మొక్కల ఆధారిత ఆహారాన్ని చేర్చాలని సూచించింది. అయితే.. ఆ ఆహార ప‌దార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

* వాల్నట్

* రాగి

* కందిప‌ప్పు

* వేరుశనగ

* అరటి

* గోధుమ పిండి

విటమిన్ బి అధికంగా ఉండే ఆహారం కణాల ఆరోగ్యాన్ని, ఎర్ర రక్త కణాల పెరుగుదల, కంటి చూపు, జీర్ణక్రియ, మెదడు ఆరోగ్యం, హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అంతేకాదు శక్తి స్థాయిలను పెంచుతుంది. 

వాల్‌నట్స్ : మోనోశాచురేటెడ్ కొవ్వులతో సమృద్ధిగా ఉండే వాల్‌నట్స్ శరీరంలోని ఎల్‌డిఎల్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో లినోలెనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే మంటను తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి.

రాగి : ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది కాల్షియం, ఇనుము క‌లిసి రోగనిరోధక శక్తిని పెంచడంలో పాత్ర పోషిస్తుంది.

కందిప‌ప్పు :  దీనిని టూర్ దాల్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉన్నాయి. క్లినికల్ డయాబెటిస్‌లో 2015 అధ్యయనం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని సూచించింది. లైవ్‌స్ట్రాంగ్.కామ్ ప్రకారం, కందిప‌ప్పు ప్రేగు క్రమబద్ధతను మెరుగుపరుస్తుంది. దీనితోపాటు గుండె స‌మ‌స్య‌ల ప్ర‌మాదాన్ని తగ్గిస్తుంది.

వేరుశనగ : ఇందులో ప‌్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడే కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. మాస్ట్రిక్ట్ విశ్వవిద్యాలయం 2015 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, వేరుశనగ తినడం వ‌ల్ల క్యాన్సర్ నుంచి ర‌క్షిస్తుంది.

అరటి : ఇందులో ఎక్కువగా నీరు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అరటిలోని పెక్టిన్, రెసిస్టెంట్ స్టార్ట్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.  వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. 

గోధుమ పిండి :  గోధుమ‌పిండి తినడం వల్ల శరీరంలోని పోషక లోపాలు నివారిస్తాయి. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 రక్తం ఏర్పడటానికి సహాయపడుతుంది. రక్తహీనతతో పోరాడానికి ఎంతో తోడ్ప‌డుతాయి.