పచ్చిబఠాణీ ఊతప్పం

కావలసిన పదార్థాలు
పచ్చి బఠాణీ: ఒక కప్పు, బియ్యప్పిండి: అర కప్పు, శనగపిండి: అర కప్పు, పసుపు: పావు టీ స్పూను, ఫ్రూట్ సాల్ట్: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్ స్పూన్లు, టమాటాలు: రెండు (సన్నగా తరగాలి), క్యారెట్ తురుము: అర కప్పు, పచ్చిమిర్చి (తరిగి): 2 టేబుల్ స్పూన్లు, పనీర్ తురుము: 4 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా పచ్చి బఠాణీలను ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో బఠాణీ ముద్ద, బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ కాస్త చిక్కగా దోశల పిండిలా కలపాలి. చివరగా ఫ్రూట్ సాల్ట్ వెయ్యాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి, వేడయ్యాక నూనె వేసి ఇందాక కలుపుకొన్న మిశ్రమాన్ని గరిటెతో కాస్త చిన్నసైజు దోశల్లా వేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత మీద నుంచి తురిమిన పనీర్,క్యారెట్, టమాటా తరుగు వేసి కొద్దిగా నూనెతో రెండువైపులా దోరగా కాల్చుకుంటే సరి.. ఆరోగ్యకరమైన, రుచికరమైన గ్రీన్‌పీస్ ఊతప్పం రెడీ.
తాజావార్తలు
- బ్లడ్‌లో హై ఒమెగా-3 ఫ్యాట్‌తో నో కొవిడ్ రిస్క్
- తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!
- 'చెరుకు రసం' వల్ల ఎన్నో లాభాలు..
- ‘ఓటిటి’ కాలం మొదలైనట్టేనా..?
- ఐటీ రిటర్న్ ఇంకా పొందలేదా..? ఇలా చేయండి..
- బాలిక బలవన్మరణం
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ఎన్నికల విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్తాం’