శనివారం 16 జనవరి 2021
Food - Aug 23, 2020 , 22:19:51

ఇమ్యూనిటీ ఫుడ్‌ కొర్ర బియ్యం పొంగల్‌

ఇమ్యూనిటీ ఫుడ్‌ కొర్ర బియ్యం పొంగల్‌

కావలసిన పదార్థాలు :

  • కొర్రబియ్యం : 3/4 కప్పు
  • పెసర పప్పు : 1/4 కప్పు
  • నీరు : 3 కప్పులు, పచ్చిమిర్చి : 3
  • మిరియాలు : 1 టీస్పూను, 
  • అల్లం తురుము : 1 టీస్పూను, జీలకర్ర : 1 టీస్పూను, కరివేపాకు : 4 రెబ్బలు
  • పసుపు : 1/4 టీ స్పూను
  • నెయ్యి : 2 టేబుల్‌ స్పూన్లు
  • ఇంగువ : చిటికెడు, జీడిపప్పు : 6, ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం :

నీటిలో కొర్ర బియ్యం, పెసర పప్పు, పసుపు కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి చల్లారనివ్వాలి. మిరియాలను మెదపాలి. నెయ్యిలో జీలకర్ర, పచ్చిమిర్చి తురుము, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు, మెదిపిన మిరియాలు వేయించాలి. తర్వాత ఉడికించిన కొర్ర మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలపాలి. కొబ్బరి చట్నీతో చాలా రుచిగా ఉండే ఈ వంటకం బలవర్ధకం కూడా!