దేశంలోని కార్మికులు అనేక పోరాటాలు చేసి తమ హక్కులు సాధించుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు రకాల నల్లకోడ్లను ప్రవేశపెట్టింది. కనీస వేతన చట్టం సవరణ చేయడంగానీ, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం పెంచడంగానీ చేయడం లేదు. అలాగే కనీస పని గంటలను అమలు చేయడం లేదు. కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతను కాపాడడడం లేదు. ఉత్పత్తి, సేవా రంగాలలో పని చేస్తున్న కార్మికులను వంచన చేస్తున్నది బీజేపీ సర్కారు. కేంద్రానికి, మోదీకి కార్పొరేట్ శక్తులే ముఖ్యం కాబట్టి.
జనం నుంచి వచ్చిన నేతగా.. కార్మిక శాఖ మంత్రి గా పని చేసిన అనుభవం ఉన్న నాయకుడిగా కేసీఆర్ కార్మిక పక్షపాతి. ఎందుకంటే ఏ నాయకులైనా ఇన్నేండ్ల పాలనలో కార్మికులను ఒక సంఘంగా, ఒక ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వారి సంక్షేమానికి పూనుకు న్న పాపాన పోలేదు. అయితే సీఎం కేసీఆర్ 33 జిల్లాలలో కార్మిక సంక్షేమ భవనాలను ఏర్పాటు చేసేందు కు స్థలాలను, నిధులను కేటాయించారు. ఇది కార్మిక సంఘాలు, నాయకులకు కేసీఆర్ ఇచ్చిన గుర్తింపుగా చెప్పుకోవ చ్చు. అంతేకాకుండా దేశంలోని 29 రాష్ర్టాల్లో తెలంగాణ ఉద్యోగులు మాత్రమే అధిక వేతనాలు, సంక్షేమ ఫలాలను పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతూ కార్మికులకు భరోసానిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండాను ఊపింది. చేతివృత్తు లు, కులవృత్తుల వారికీ చేయూతనందిస్తున్నది.
కార్మికుల సంక్షేమం, ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు తెలంగాణ కార్మిక సంక్షేమనిధి చట్టం 1987 అనుసరణ ఉత్తర్వులు 2014 చేసి, తద్వారా కార్మికుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధి నుంచి కార్మికులకు వైద్య సాయంగా, ప్రమాదవశాత్తు మరణించినా, వివాహం జరిగినా, ప్రసూతి, కుటుం బ నియంత్రణ ఆపరేషన్, విద్యా ప్రోత్సాహం, ఇలా ప్రతిదశలో రూ.2వేల నుంచి రూ.30 వేల వరకు సా యం అందుతోంది. అంతేకాకుండా 1996 కార్మిక చట్టం ప్రకారం భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మిక లబ్ధిదారులకు వివాహం, ప్రసూతి, మరణం, అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం వంటివి సంభవించిన సమయంలో రూ.30 వేల నుంచి రూ.6 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, నాన్ ట్రాన్స్పోర్ ఆటో డ్రైవ ర్లు, హెూంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను ప్రభుత్వం అందిస్తున్నది.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో వరంగల్‌లో భవన నిర్మా ణ, ఇతర రంగాల కార్మికులకు సభ్య త్వం కోసం 12,690 మంది కార్మికులకు రూ.110 ఆయన చెల్లించి, రూ.10 లు కార్మికులు చెల్లించేలా సంక్షేమ మండలి ద్వారా వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. కార్మికుల్లో ఎవరికైనా ప్రమాదం జరిగితే సంక్షేమ మండలి ద్వారా నష్టపరిహారం,ఇతరత్రా బెనిఫిట్స్ ఇప్పిస్తున్నారు. దీనివల్ల ఇప్పటి వరకు సుమారు 5,125 మంది కార్మికులకు రూ.45 కోట్ల 71 లక్షల లబ్ధి చేకూరింది. రాజమండ్రి బోటు ప్రమాదంలో మరణించిన కాజీపేటకు చెందిన బస్కె రాజేంద్రప్రసాద్ కుటుంబానికి రూ.6 లక్షల ముప్పైవేలు ఇప్పించారు. ఇది భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డు ఉండ టం వల్లే సాధ్యమైంది.
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది పశ్చిమ నియోజకవర్గంలో కార్మిక సంక్షేమ మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేయించే వినూత్న కార్యక్రమాన్ని సైతం చేపట్టారు.. సీఎస్సీ హెల్త్ కేర్ ద్వారా కార్మికులకు వారి కుటుంబసభ్యులకు సైతం సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు (50కి పైగా ఆరోగ్య పరీక్షలు) నిర్వహించి, రోగ నిర్ధారణ జరిగితే తక్షణమే చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. కార్మికుల నివాసాల సందర్శన, వారి కుటుంబసభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలు, విశ్రాంత ఉద్యోగుల సమావేశాలు, కార్మిక చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. కార్మికులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు..
తెలంగాణలో కార్మికుల పక్షపాతిగా కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు కార్మిక లోకానికి తెలిసేలా అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలి. అన్ని జిల్లాల్లోని కార్మికుల సంక్షేమానికి సైతం ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ క్రమంలో ప్రభు త్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు పరిశ్రమలను అమ్ముతున్న కేంద్రంపై కార్మిక లోకాన్ని జాగృతం చేస్తూనే ఉ న్నాం. భారత రైల్వే, బీఎస్ఎన్ఎ ల్, ఎల్ఐసీ, పోస్టల్, ఎయిర్వేస్, పోర్ట్, ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ట్రాన్స్‌కో, జెన్కో, ఉక్కు ఉత్పత్తి వంటి అనేక సంస్థలను అమ్ముతూ, బడా పారిశ్రామిక వే త్తలకు ధారాదత్తం చేస్తున్న విధానాన్ని ప్రజల ముందుంచేందుకు కార్మికులంతా ముందుండాలి.