ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు చాలా పెద్ద కథే ఉన్నది. 1914లో మొదలైన రాష్ట్ర సాధన గుంపు ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. బాపట్ల (1913), అనంతపురం (1927) వంటి జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లోనే కాకుండా, వారికి ఆంధ్ర ప్రాంతాల్లో నిర్వహించటానికి ఇబ్బందులు ఉన్నప్పుడు తెలంగాణలో కూడా వారి సభలు నిర్వహించారు. ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా ఉన్నవారిని పోగుచేసి తమ పబ్బం గడుపుకొన్నారు.
మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జోగిపేట (1930)లో నిర్వహించారు. అప్పటినుంచి ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ఆ సభలు జరిగాయి. ఇక్కడి నాయకులతో సహా ప్రజలు ఎంత అమాయకులంటే వారు నిజాం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి కూడా ఆంధ్ర నాయకుల ప్రోద్బలంతో ‘ఆంధ్ర జన సంఘం’ అని పేరు పెట్టుకొని 1921 నుంచి ఆంధ్ర ఉద్యమ నాయకులకు అన్నిరకాలుగా మద్దతు, సహాయ సహకారాలు అందించారు. లేకపోతే, ఆదిలాబాద్‌లో ఆంధ్ర మహాసభ ఏమిటి? ఆ ప్రాంతంలో మాట్లాడే భాషలో ఒక్క ముక్కైనా ఆంధ్ర నాయకులకు అర్థమవుతుందా? అంటే అప్పటినుంచే ఆంధ్ర నాయకుల పెత్తనం తెలంగాణ నాయకుల మీద సాగింది. అది ఎంతవరకు సాగిందీ అంటే మహాకవి పోతన రాసిన శ్రీమద్భాగవతాన్ని 1848లో మద్రాసులో మొట్టమొదటిగా పూర్తిగా ప్రచురించిన వారు కూడా దాన్ని తెలుగు భాగవతం అని అన్నారు. వ్యాసమహర్షి భాగవతానికి తెలుగు అనువాదం, పోతన రచయిత అని పుస్తకం వేశారు. కానీ, 1921 నుంచీ ఎప్పుడైతే ఆంధ్రవారి సోపతి తెలంగాణ వారికి తగిలిందో, వారికి కూడా తెలియకుండా తెలంగాణ పోతన భాగవతం కాస్తా శ్రీమద్ ఆంధ్ర భాగవతంగా తర్వాతి వారు అచ్చువేయడం జరిగింది. అప్పటినుంచి దాదాపు 90 ఏండ్లకు కూడా ఆ మోసం గమనించని తెలంగాణ వారిని బాగా అర్థం చేసుకున్న మహామహుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోతన బమ్మెరకు చెందడు, ఒంటిమిట్టకు చెందుతాడు, అక్కడి రామాలయంలో కూర్చొని ఆ భాగవతం రాశాడని కొత్త చరిత్ర సృష్టించాడు.
ఇక ఇప్పుడు చంద్రబాబు బహుశా, ఆ రామాలయాన్ని భక్తరామదాసు కట్టాడు, కనుక రామదాసు కూడా ఒంటిమిట్టవాడే అంటాడేమో! అయితే, పక్కవాళ్లెవరికీ ఏ క్రెడిట్ ఇచ్చే అలవాటులేని చంద్రబాబు బహుశా అది పట్టించుకోకపోవచ్చు. పైగా ర్యాపిడో సర్వీసు మొదలుపెట్టినవాడు ఆంధ్రలో ఒక జిల్లాకు చెందుతాడని తెలిసి ఆ ఆలోచన ఆయనకు తానే ఇచ్చినట్టు అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. ఆ సర్వీసు మొదలుపెట్టిన ఆయన కొడుకు మద్రా సు ఐఐటీలో బీటెక్ చేసి, స్వతంత్రంగా ఉండాలని భావించి తండ్రితో మొదలుపెట్టిస్తే, ఆ గొప్ప ఆలోచన తన సంచిలో వేసుకుంటున్నాడు ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి. బహుశా ఆ అబ్బాయికి ఐఐటీలో చదువమని తనే సలహా ఇచ్చానని చెప్తాడేమో తన తర్వాతి ప్రజా సభలో. ఆయనకు సాధ్యం కానిదేముందీ? 1904 నుంచీ తెలంగాణలో పెద్ద పాఠశాలలు, కళాశాలలు ఉండగా కొద్దిగా తేదీ మార్చి తెలంగాణలో చదువులు లేకపోతే 1995లో తాను ముఖ్యమంత్రి అయ్యాక శ్రీకారం చుట్టానని చెప్పాడుగా ఈ ప్రాంత విద్యారంగానికి!
ఇక పాత కథలోకి వెళ్లి రాష్ట్రం సాధించిన రోజు, ఆంధ్ర నాయకులు ఏం మాట్లాడారో చూద్దాం! ఆ ముందు కూడా చాలా నాటకాలు జరిగాయి. నిజానికి 1927లోనే మద్రాసు శాసనసభలో ఆంధ్ర రాష్ట్రం తీర్మానం బలపర్చబడింది. రాయలసీమ వారు తాము మద్రాసు రాష్ట్రంలోనే ఉంటామని గట్టిగా వాదించినా, ఇటు ఆంధ్ర, అటు తమిళ శాసనసభ్యులు వ్యతిరేకించటంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. అందుకే ఆంధ్ర సినిమా ప్రబుద్ధులు రాయలసీమ వారిని రౌడీలుగా, గుండాలుగా చిత్రిస్తారు ఇప్పటికీ వారి సినిమాలలో.
నిజానికి తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా స్నేహశీలులు, కృష్ణా, గోదావరి జిల్లాల వారి లాగా పెత్తనాలు, మోసాలు చేయరు. అదీ కాక ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాజకీయ నాయకులు రాయలసీమ కరువు గురించి, ఆ ప్రాంతంలో విద్యాభివృద్ధి, ప్రాజెక్టు నిర్మాణం గురించి ప్రభుత్వంతో గట్టిగా అడుగలేదు. ఆ బాధతోనే రాయలసీమ నాయకులు ఆంధ్రతో ఉండటాన్ని వ్యతిరేకించారు.
కానీ, ఆ ప్రాంతం, తర్వాతి కాలంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర నాయకుల పెత్తనానికి, దురాశ, అవినీతికి బలైపోయాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా 27 1/2 ఏండ్లు రాయలసీమ నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవటానికి కారణం ఆంధ్ర ప్రాంత నాయకు లే. తెలంగాణ ఉద్యమం చివరిదశకు వచ్చినప్పు డు జేసీ దివాకర్‌రెడ్డి (ఈయన సీమ నాయకుడు) చిత్రమైన ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన పెట్టా డు, ‘దుంగవదిలి మొద్దు ఎత్తుకున్నట్టు’! అంద రం నవ్వుకున్నాం ఆ ప్రతిపాదనకు, ‘మొగుడికి విడాకులిచ్చి, ఆడబడుచును సాకినట్టు’ అనుకొని!
1927లో మద్రాసు శాసనసభ ఒప్పుకొని ఆం ధ్ర రాష్ట్ర ఏర్పాటు 26 ఏండ్లు జరగని కారణం ఆంధ్ర నాయకుల దురాశే! నెహ్రూ దగ్గరికి ఆంధ్ర నాయకులు మద్రాసు రాజధాని కోసం బారులు కట్టడంతో ఆయనకు చిరాకు వచ్చి, ‘అది మీరు, తమిళ సభ్యులు తేల్చుకొని రండి నా దగ్గరకు’ అ ని విసుక్కున్నాడు. ఇక పాపం మద్రాసు కోసం నిరాహార దీక్ష చేసిన శ్రీరాములు కూడా (దీక్ష మద్రాసు కోసం, విశాలాంధ్ర కాదు, హైదరాబాద్ కాదు) తమిళులకు, ఆంధ్రులకు ఉమ్మడి రాజధానిగా మద్రాసును ఉంచాలని అభిప్రాయపడ్డాడు, ప్రకటించాడు. అప్పటి పరిస్థితి గురించి వార్తా పత్రికలు కూడా విస్తృతంగా రాశాయి. శ్రీరాములును రక్షించుకోవటానికి ఆంధ్ర నాయకులు తమిళ నాయకులతో సంప్రదించి ఒక ఒప్పందానికి రావాలి. కానీ, ఆంధ్ర నాయకులెవరూ ఆ ప్రయత్నాలు చేయలేదు. వీరి మధ్య ఒప్పందం కుదిరితే కేంద్రం వెంటనే రాష్ట్రం ఏర్పాటుచేస్తుంది. కామరాజ నాడార్, సుబ్బరాయన్ (తమిళ రాజకీయ నాయకులు) ఈ చర్చలకు సిద్ధంగా ఉన్నారు (ఆంధ్ర పత్రిక, 13 డిసెంబర్ 1952).
1927లో మద్రాసు శాసనసభ ఒప్పుకొని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 26 ఏండ్లు జరగని కారణం ఆంధ్ర నాయకుల దురాశే! నెహ్రూ దగ్గరికి ఆంధ్ర నాయకులు మద్రాసు రాజధాని కోసం బారులు కట్టడంతో ఆయనకు చిరాకు వచ్చి, ‘అది మీరు, తమిళ సభ్యులు తేల్చుకొని రండి నా దగ్గరకు’ అని విసుక్కున్నాడు.
శ్రీరాములు కూడా తర్వాత ‘ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటే ముఖ్యం, రాజధాని ఎక్కడైనా అమర్చుకోవచ్చు’ (ఆంధ్ర పత్రిక, 14 డిసెంబర్ 1952) అన్నారు. కానీ, ఆంధ్ర రాజకీయ మూర్ఖపు పట్టుదల వల్ల శ్రీరాములు డిసెంబర్ 15న మరణించారు. ఇది ఆంధ్ర నాయకుల క్రూరత్వం, దురాశ తెలిపే ప్రమాణం కాదా? రాయలసీమ వారిని రౌడీలనే ఈ ఆంధ్ర నాయకులను ఏమందాం? తమ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మనిషిని ఒక్క నిర్ణయం తీసుకొని రక్షించుకునే అవకాశం ఉండి కూడా అందుకు ప్రయత్నించకపోవటానికి కారణం? పొట్టి శ్రీరాములు కోమటి కులానికి చెందటమా? సాంస్కృతికంగా నెల్లూరు, సీమ సంస్కృతి కలిగి ఉండటమా? ఇప్పుడు నెల్లూరుకు ‘పొట్టి శ్రీరాము లు జిల్లా’ అని పేరు పెట్టడం ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావు గోపాలరావు పాత్రను గుర్తుచేయ టం లేదా? ఇంకా విచిత్రాలు! 1950లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు నెహ్రూ ఒప్పుకొన్నా తనను ముఖ్యమంత్రి చేయరని ప్రకాశం పంతులు ‘మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం తమకు వద్దు’ అని డిసెం ట్ నోట్ ఇచ్చి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నాడు. ఈయన వద్దన్న అసలు కారణం తెలిసి, నెహ్రూ ప్రకాశాన్ని పిలిచి సీఎం పదవి ఇవ్వగానే మద్రాసు లేని రాష్ర్టానికి గంతులేసి ఒప్పుకొన్నాడు. 1950 లోనే ఒప్పుకొంటే శ్రీరాములు బలయ్యేవాడు కాదు కదా?
టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా 1953 సెప్టెంబర్ 1న కర్నూలు రాజధానిగా ఏర్పడింది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ రాష్ర్టావతరణ సభలో మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘ఆంధ్రుల సొంత రథం సాగింది. తాత్కాలికంగా కర్నూలులో ఆగింది కానీ, ఈ రథం హైదరాబాద్ వెళ్లేవరకు ఆగదు’. తన ఊరు తిరుచానూరులో పెట్టుకోవచ్చు కదా రాజధానిని, ఆయన! ఇంకా తమాషా ఏమిటంటే, ఆంధ్ర మహాసభల కోసం వచ్చి హైదరాబాద్ వైభవం చూసిన ఆంధ్ర ఉద్యమ నాయకులకు ఈ నగరం కొట్టేయాలన్న దురాశ కలిగిందని మనకు చాలా ప్రమాణాలున్నాయి.
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక్కరోజు ముందు – అంటే 30 సెప్టెంబర్ 1953న సంజీవరెడ్డి అధ్యక్షతన బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకట్రావు, కడప కోటిరెడ్డి, దామోదరం సంజీవయ్య, అల్లూరి సత్యనారాయణ రాజులతో ఒక ఉప సంఘం ఏర్పడింది. దీనికున్న ఒక్కటే ఉద్దేశం ‘ఆంధ్ర, తెలంగాణలను కలిపి విశాలాంధ్రగా హైదరాబాద్ రాజధానితో ఒకే రాష్ట్రం ఏర్పర్చాలని కేంద్రాన్ని ఒప్పించటం! ‘ఇదెలా ఉన్నది? కొత్తగా పెండ్లయిన యువకుడు పెండ్లాన్ని వదిలి, కంతలోంచి పక్కింటి వాడి భార్యను చూసినట్టు లేదూ?