ఖడ్గం అంచు పైన తెల్ల పావురం నెత్తురు బురదలో మొలుస్తున్న కలువలు తాండవం దారిలోనే నెమలి ఆట జీవన బృందావనంలో శాంతి మురళి గానం పడగ విప్పిన సర్పం తల ఊపుతుంది పులి మేకతో కలిసి సయ్యాటలాడుతోంది ఒక అభయంకర జీవితం…
పూలు పూలుగా కురుస్తున్న అక్షరం ఎనలేని పరిమళం ఎక్కడిది ఇదంతా ఏ పోహళింపు పరిణామం ఇదంతా యుద్ధం అంటే నెత్తురేనని భయం బొరియలో ఊపిరి కూడా సరిగా తీయలేని విషాద అస్తిత్వమేనని వెనకైనా ముందైనా కిందైనా మీదైనా చరమ సంధ్య ఓటమేనని ఎప్పుడు తెలుస్తుంది? యుద్ధానికి నువ్వు చెప్పే అబద్ధం నిజమే అనుకున్నా దాని పర్యవసానం శాంతేనని గుట్టు నీ గుండెలో ఎప్పుడు విప్పారుతుంది జీవితం అసత్యం కాదు భ్రమ అసలే కాదు దీన్ని రక్తంతో అనుభవించడం…
క్షమశాంతి క్రాంతికి మూలధాతువులు యాత్రికుడా ఇంకా ఎడారి యానం చేయకు చమరింతల కనుల లోలోపలి చెలిమను ఎండనీయకు జీవితాన్ని మరొక తూర్పు ముఖం చెయ్ శాంతి-యుద్ధం బొమ్మ బురుసులే చివరి విజేత నిశ్చయంగా శాంతే