2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చి తనదైన శైలిలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా రెండవసారి 2018లో కూడా అధికారంలోకి వచ్చి పదేండ్లు పూర్తిచేసుకున్న ప్రభుత్వం నేడు అతి ముఖ్యమైన ఎన్నికల సమరంలో తలపడుతున్నది. ఈ పదేండ్ల అభివృద్ధిలో దేశంలోనే వివిధ రాష్ర్టాలతో పోటీపడుతూ తనదైన శైలిలో తెలంగాణ మాడల్‌ను దేశానికి పరిచయం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఎన్నికల్లో కూడా ‘సాధించింది చాలా ఉంది. కానీ మనం సాధించాల్సింది ఇంకా ఉంది’ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ నేడు ఎన్నికల సంగ్రామంలో ప్రచారం కొనసాగిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేండ్లలో పలురంగాల్లో సరికొత్త నూతన పథకాలు, విధానాలను ప్రవేశపెట్టి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. ఈ పదేండ్లలో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలకు సాగునీరు, పరిశ్రమలకు, గృహాలకు పంటలకు 24 గంటల కరెంటు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ సురక్షిత మంచినీరు అందించింది. మైనారిటీల సంక్షేమం, తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానం, పెట్టుబడులకు ఒక గమ్యస్థానంగా తెలంగాణ మారింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సామాజిక భద్రతలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ అందించింది. దేశానికే ధాన్యాగారంగా మన తెలంగాణ మారడానికి రైతుబంధు, రైతుబీమాలతో రైతు కుటుంబాలకు భరోసానిచ్చింది. రుణమాఫీ, విస్తరించినటువంటి వైద్య సదుపాయాలు, వైద్య విద్య, గర్భిణులకు, బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం, కంటి వెలుగు, మిషన్ కాకతీయ వంటివెన్నో అమలు చేసింది.
హైదరాబాద్ దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైనటువంటి విశ్వనగరంగా మారింది. రాష్ర్టాన్ని పచ్చదనంతో విరజిల్లేలా హరితహారాన్ని రూపొందించింది. ఇలా అనేకమైనటువంటి పథకాలను, విధానాలను, కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ పదేండ్లలో చేసినటువంటి పనులు దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీబీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం గట్టాల్సిన అవసరం ఉన్నది.
మూడోసారి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఏం చేయాలి? అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను కూడా కలిగి ఉన్నది. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా చూపెట్టాలని ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. అదేవిధంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలపటం, యువతకు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవడానికి హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత ఆమోదయోగ్యమైన నగరంగా మార్చడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. తెలంగాణను ప్రపంచంలోనే పెట్టుబడుల రాష్ట్రంగా మార్చడానికి ప్రపంచ టాప్ 500 పరిశ్రమలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడం, ప్రపంచ సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ రాష్ర్టాన్ని మార్చడానికి కూడా బీఆర్ఎస్ ప్రభు త్వం మళ్లీ అధికారంలోకి రావాల్సి ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడానికి మాత్రమే అధికారం తిరిగి ఇవ్వాలని కోరుతున్నది. కనుక బీఆర్ఎస్ను గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
-డాక్టర్ శ్రవణ్ కుమార్ కందగట్ల
86393 74879