అభివృద్ధి ఆగమైంది
తెలంగాణకు గాయమైంది
ప్రజా సంక్షేమం పాడైపోయింది
ప్రగతి పక్కదారి పట్టింది
సంక్షేమం సావు బతుకుల్లో ఉన్నది
కొన జీవితో కొట్టుకుంటున్నది
నీరు లేక చెరువు
నింగి చినుకు చూస్తుంది
మాగాని లేక
మా పల్లె మూగబోయింది
కల్యాణలక్ష్మి తులం బంగారం
హామీలు అడుగున పడిపాయే
గద్దెనెక్కినాక గళం సుత్తి తప్పే
హామీల పథకాలు అమలు మతి తప్పే
ప్రజావాణి చుట్టూ
ప్రజలు తిరుగుతుండ్రు
నెరవేరని హామీలను
నెమరేసుకుంటున్నది జనం
ప్రజా పాలన
తప్పుడు తోవులో తొక్కిసలాట
గత పరిపాలన గంభీరంగా ఉన్నదని
మతి తప్పకుండా యాజ్జేసుకుంటున్నది
– దేవరపాక కృష్ణయ్య 99634 49579