ఉషోదయాన
సుందర కశ్మీర్‌పై దురాక్రమణ బుద్ధి
సమరభూమిలో
అరుణారుణ సిందూరం
గంగా యమునా కృష్ణా గోదావరీ
కావేరీ నర్మదా సింధూ జలాలే
భారతీయుల అగ్ని రుధిరం
వృథా కావు కశ్మీర్ కన్నీళ్లు
దుర్బుద్ధి ఎప్పుడూ దుఃఖమే
భూమి కోసం మతాధిపత్యం కోసం కండూతి
చారెడు నేల లేకుండా చేస్తుంది
కత్తి పడితే కాలం మురువాలి!
యుద్ధం మొదలెడితే
ముష్కరుల వెన్నులో వణుకు పుట్టాలి !
దొంగ దెబ్బలు చావు దెబ్బలకు
భారత సింహాలు బెదరరు
పహల్గాం యుద్ధం సృష్టించింది
ఒక్కొక్క రుధిరపు బొట్టు ఒక్కొక్క మిస్సైల్
సిందూరపు శస్త్ర చికిత్సలు
సలాం సిందూరం