ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఒకప్పుడు ముంబై, హైదరాబాద్‌కు వలసలు వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు సరిహద్దు రాష్ర్టాల నుంచి పాలమూరుకు ఉపాధికోసం వస్తున్నారు. దీనికి కారణం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమే.
నాడు ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. కృష్ణ, గోదావరి జీవనదులు తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్నా తాగునీరు, సాగునీరుకు నోచుకోని పరిస్థితి. తెలంగాణ ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజె క్టుల నిర్మాణానికి పూనుకున్నారు.
ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందించే విధంగా ముందుకు పోతున్నారు. ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలపైన దృష్టి సారించి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. రా ష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగు, తాగు నీరందనున్నది. దాదాపు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందిం చడం ప్రాజెక్టు లక్ష్యం. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామ ర్థ్యం 67.67 టీఎంసీలు. పరిశ్రమల అవస రాలకు 3 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోస్తారు. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
హైదరాబాద్ నగరానికి తాగునీటితోపాటు, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరందుతుం ది. నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అవసరాలను కూడా ఈ ప్రాజె క్టు తీర్చనున్నది. వర్షాకాలం లో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా ఏడాదంతా నీటి నిల్వ ఉండేలా ప్రభుత్వం ముందు చూపుతో ప్రాజెక్టును నిర్మిస్తున్నది.