ఆ.వె.॥
కాంగిరేసువచ్చి కష్టాలు తెచ్చేను
మభ్య పెట్టు చుండ్రు మంత్రులంత
నీటి మీది రాత నాటివాగ్దానాలు
నమ్మి నట్టి ప్రజల నడుము విరిగె
ఆ.వె.॥
ఇచ్చి నట్టి మాట పచ్చి తప్పేనులే
ఓట్ల కొరకు నాడు కోట్ల కొలది
పలుకు లెన్నొ పలికి ప్రజలను ముంచిరి
నమ్మి నట్టి ప్రజల నడుము విరిగె
ఆ.వె.॥
రైతు బంధు లేదు మెతుకులు కరువాయె
చితికి పోయి బ్రతుకు చితికి పోయె
కూడు గూడు లేక కూలెను రైతులు
నమ్మినట్టి ప్రజల నడుము విరిగె
– జాధవ్ పుండలిక్రావు పాటిల్ 94413 33315