సుశ్లోకం
పూజ్యతే యద పూజ్యోపి
యద గమ్యోపి గమ్యతే
వంద్యతే యద వంద్యోపి
స ప్రభావో ధనస్యచ!
ఒక వ్యక్తి ధనవంతుడైనప్పుడు అతడు పూజింపకూడని వాడైనప్పటికీ పూజింపబడుతాడు. పోగూడని వ్యక్తి ఐనప్పటికి అతని వద్దకు పోతారు. నమస్కరింప తగని వ్యక్తి ఐనప్పటికినీ నమస్కరిస్తారు. ఇదంతా ధనం ప్రభావంగా భావించాలి. అంతేగానీ అతని గొప్పతనం కాదని గ్రహించాలి.
– టి.సుధాకరశర్మ