నగరం అందాల పోటీలతో కులుకుతున్నది
అకాల వర్షాలతో రాష్ట్రం కుములుతున్నది
అందగత్తెలు సౌందర్య రాశులను
కురిపించనున్నారు
కర్షకులు, తమ ధాన్యరాశులు తడిసి విలపిస్తున్నరు
ఆర్థికంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అని ప్రవచనాలు
విదేశీ అందాల తారామణులకు కోట్ల ఖర్చులు
మార్కెట్లలో ధాన్యం కొనేవారు లేక కర్షకుల, నెర్రెలు
రైతుల సతీమణుల కన్నీళ్లపై లేదు కనికరం
అప్పులు తీర్చే దారి లేక ప్రజలకు ఉరితాళ్లు
వారి ఓట్లతో గెలిచిన, నాయకుల కేళీ విలాసాలు
జనం కుయ్యో, మొర్రో అని అరిచిన పలకరించని ప్రభులు
బెదిరింపులు, అదిరింపులతో పార్టీ మీటింగులు
కోరికలు కోరవద్దని హెచ్చరికలు
ఎన్నికల ముందు వంగి దండాలు
ఉద్యోగులను, సేవకులుగా చులకన చూపులు
గెలిచిన తదుపరి నియంతృత్వ పోకడలు
సంక్షేమ పథకాల గతి ఏమిటని హూంకరింపులు
ప్రజల వద్దకు వెళ్లి బాగోగుల పైన ప్రశ్న జవాబులు
ఆకర్షణీయమైన, పథకాలు ప్రకటించి మీనమేషాలు
ప్రతిపక్షంపై సిగ్గులేని బూతు పదాలు
పేరుకే మనది ప్రజాస్వామ్య దేశం
నిరసనలు తెలపటానికి లేదట అవకాశం
పాలనను ప్రశ్నిస్తే అవుతుంది నేరం
అథితులకు పట్టాలట బ్రహ్మరథం
ఉద్యోగ సంఘాల అల్టిమేటం
జెడిసి తల పట్టుకున్నది రాష్ట్రం
ప్రగల్భాలతో ఊరేగిన వైనం
భవిత చూపనుంది అసలైన పథం
– నమిలకొండ నాగేశ్వర్రావు 86885 53470