అర్థం సంప్రతిబంధం ప్రభురధిగంతుం సహాయ వానేవ
దృశ్యం తమసి నపశ్యంతి దీపేన వినా సచక్షురపి
ఒక ప్రయోజనం సాధించటానికి ఆటంకాలు ఎదురగుచున్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోవటంలో తప్పులేదు. కండ్లున్నప్పటికీ చీకటిలో ఉన్న వస్తువులను చూడటానికి దీపం సహాయం అవసరం కదా. లక్ష్యాన్ని సాధించటానికి ఇతరుల సహాయం తీసుకోవటం అవసరం.