పిల్లి కళ్ళు మూసుకుని
పాలు తాగుతున్నది
పారిపోయిన ఎలుకలు
కలుగుల్లోంచి తొంగి చూస్తున్నాయి!
విడిపోయిన రాష్ర్టాలు వింతగా
ఒక్కటై దర్శనమిస్తున్నాయి!
దింపుడుగళ్ళం ఆశలు
ఇంకా సజావుగానే మిగిలి ఉన్నాయి
పైపైన బీరాలు పలుకుతున్న
మనిషి లోపలి పచ్చ రంగు
ఇప్పటికీ బహిరంగ రహస్యమే!
కాపలాదారుడు మారినప్పుడే
నీటి కుట్రలకు తెరలేచింది
ఇప్పుడు నిప్పు రాజేస్తున్నది
బనకచర్ల జలాశయమే!
జజ్జనక జనక
బై బోలో తెలంగాణ!!