జాతిపిత అనే పదం ఎప్పుడూ అందరి అంగీకారంతో ఏర్పడిన పదం కాదు. రాజకీయ తత్వశాస్త్రంలో ఇది ప్రభుత్వమిచ్చే బిరుదు కాదు, చట్టపరమైన పదవీ కాదు. ఒక రాజకీయ వ్యవస్థ పుట్టుకలో ఎవరి పాత్ర లేకుండా ఆ వ్యవస్థను ఊహించలేమో, అలాంటి వ్యక్తి కృషిని గుర్తించేందుకు ఉపయోగించే తర్కబద్ధమైన భావన మాత్రమే. అందుకే, ఎవరో ఈ గుర్తింపునుఅంగీకరించలేదని ఆ వ్యక్తి చేసిన కృషి తగ్గిపోదు. ఈ కోణంలో చూస్తే, కే చంద్రశేఖర్‌రావును తెలంగాణ జాతిపిత అని పిలువడం భావోద్వేగంతో కూడిన నినాదం కాదు- ఒక చరిత్రాత్మక విశ్లేషణ.
పాలకుడు వేరు – స్థాపకుడు వేరు.
రాజకీయ తత్వశాస్త్రం ఒక కీలక తేడాను స్పష్టంగా చెప్తుంది.
ఈ విషయం గురించి అరిస్టాటిల్ చాలా సూటిగా చెప్పారు.
The lawgiver should frame his laws with a view to the permanence of the constitution
-Aristotle (Politics)
ఇదే విషయాన్ని హన్నా అరెండ్ ఇలా వివరించారు.
Every beginning contains its own violence
-Hannah Arendt (On Revolution)
జాన్ జాక్ రూసో ఇలా అన్నారు.
He who dares to found a people must be capable of changing human nature
-Jean-Jacques Rousseau (The Social Contract)
ఆంటోనియో గ్రాంశీ ఇలా అన్నారు.
A social group becomes dominant when it exercises moral and intellectual leadership
-Antonio Gramsci, (Prison Note books)
హన్నా అరెండ్ చెప్పిన మాట ఇది.
The very essence of freedom is the capacity to begin
-Hannah Arendt
రాష్ట్ర ఆవిర్భావంలో..
పక్షి నిర్మించిన గూటిలో
పామొకటి జొరబడ్డది
పొదిగిన గుడ్లను తినడం మినహా
పక్షి విలువ తెలియదు
నిర్మిత గూడు చరిత్రా తెలియదు!
జాతి పేరెత్తనోనికి
జాతిపిత ఎవరో తెలియకపోవడం
పెద్ద వింతేమీ కాదు!
పరాయి పాలనా బానిసత్వానికి
అహింస నిప్పు పెట్టినవాడే
ఆత్మగల నేత మన జాతిపిత!
పల్లమే ఎరిగిన నదీనదాలకు
ఎగబాకటం నేర్పిన
అపర భగీరథుడే మన జాతిపిత!
పల్లేరులు మొలిచిన నేల మీద
ఆకుపచ్చని అందాలద్దిన
కర్షకశిల్పే మన జాతిపిత!
ఆత్మగౌరవాన్ని
తెలంగాణ జాతి పతాకను చేసిన
నిరుపమాన యోధుడే మన జాతిపిత!
సకల జనుల సమ్మె కల్పనా చతురుడు
వైరి ఊహలకందని
వ్యూహకర్తే మన జాతిపిత!
రాజ్యం కోల్పోయినంత మాత్రాన
ధర్మజుడు రాజు కాకపోడు
వెకిలి మాటలకు తరగని
కీర్తే మన జాతిపిత!!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి 94402 33261
– పెండ్యాల మంగళాదేవి