తెలంగాణ ఉద్యమ సారథిగా, రాష్ట్ర సాధకుడుగా, రెండు విడతల ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్‌ను కేసులు, నోటీసుల పేరిట వేధింపులకు, కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదు. ఆయన్ను అవమానించటం అంటే తెలంగాణ నేలను అవమానించటమే. తెలంగాణ ఆత్మకు మలినం ఆపాదించటమే. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి కక్ష రాజకీయాలతో కాలహరణం చేయడం దారుణం.
ప్రజలకు ఎన్నో సమస్యలున్నాయి. పాలకులు పాలనను మెరుగుపర్చాల్సి ఉన్నది. ఈ తరుణంలో ప్రభుత్వం సంక్షేమం, సమృద్ధి సాధనపై దృష్టి నిలుపాలి. అందుకు విరుద్ధంగా కేసులు, నోటీసులు, విచారణలు అంటూ రాజకీయ ప్రత్యర్థుల వెంటపడటం సహేతుకం కాదు. దీనిని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. ఈ తరహా కక్ష రాజకీయాలకు ఇకనైనా ముగింపు పలుకాలని తెలంగాణ సృజనకారులుగా కోరుకుంటున్నాము.
– గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, చంటి క్రాంతికిరణ్, టంకశాల అశోక్, కట్టా శేఖర్‌రెడ్డి, తిగుళ్ల కృష్ణమూర్తి, కే శ్రీనివాస్‌రెడ్డి, బుద్దా మురళి, వర్ధెల్లి వెంకటేశ్వర్లు, జూలూరు గౌరీశంకర్, కనకదుర్గ దంటు, డీ పాపారావు, పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, ఆస్కాని మారుతి సాగర్, హజారి రమేశ్, నాగవరం బలరాం, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వనపట్ల సుబ్బయ్య, ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, ప్రొఫెసర్ చంద్రి రాఘవరెడ్డి, బీ ప్రసేన్, వజ్జల శివకుమార్, లక్ష్మణ్ మంగళారపు, నాగేందర్ కాసర్ల, విశ్వనాథుల పుష్పగిరి.