ఆలోచన ఆగిపోతే.. అదేనోయి మరణము
ఆలోచన సాగిపోతే.. అదేనోయి చలనము॥
వానజల్లు కరిసిందా.. వాగువంక పారిందా
నేలతల్లి మురిసెను.. వచ్చేనోయి వసంతము॥
ఎండమావిని చూసినీవు.. నీళ్లే అని మురిసిపోకు
నకిలీకి మెరుగు ఎక్కువ.. ఉరకకోయి నీరసము॥
చెట్టు ఫలాలు తానే తినదు.. ముబ్బు నీటిని తానే తాగదు
పరుల సేవలో జన్మసాగితే.. ఆజన్మేనోయి ధన్యతము॥
రాళ్లు అడ్డున్నాయని.. ఆగిపోదు సెలయేరు
కష్టాలున్నాయని.. ఆపకోయి జీవితము॥
–బూర దేవానందం
94949 96143