ఏజీపీఎల్కు హైకోర్టులో ఊరట
అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ (ఏజీపీఎల్)కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా సీమ్ (ఎస్ఈఐఎస్) కింద ఆ కంపెనీకి లభించే ప్రయోజనాలను పరిమితం చేస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్యులర్‌ను రద్దు చేసింది.
- డీజీఎఫ్టీ సర్యులర్ కొట్టివేత
హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ (ఏజీపీఎల్)కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా సీమ్ (ఎస్ఈఐఎస్) కింద ఆ కంపెనీకి లభించే ప్రయోజనాలను పరిమితం చేస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్యులర్‌ను రద్దు చేసింది. విదేశీ వాణిజ్య విధానంలో లేని నిబంధనలను కార్యనిర్వాహక సర్యులర్ ద్వారా చేర్చడాన్ని తప్పు పట్టింది.
2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎస్ఈఐఎస్ కింద ఏజీపీఎల్కు మం జూరైన ప్రయోజనాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పాలసీ సర్యులర్ ద్వారా పరిమితం చేశారు. వాస్తవ సేవలందించే సంస్థలకే ఎస్ఈఐఎస్ ద్వారా ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుందని పేరొంటూ.. పోర్టు ఆపరేటర్ల ప్రయోజనాల పరిధి నుంచి ఏజీపీఎల్ను తప్పించారు. దీంతో వాణిజ్య విధానంలో లేని విషయంపై సర్క్యులర్ ద్వారా ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏజీపీఎల్.. ఇదే సర్యులర్‌ను ఇతర హైకోర్టులు రద్దు చేశాయని వివరించింది.
దర్యాప్తు సమయంలో తమపై బలవంతపు చర్యలు తీసుకోరాదని కోరుతూ రూ.2.95 కోట్లు చెల్లించినట్టు తెలిపింది. అనంతరం డీజీఎఫ్టీ సర్క్యులర్ చట్టబద్ధమైనదేనని ప్రభుత్వం ప్రతివాదన చేసింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు ఆ సర్యులర్‌ను రద్దు చేసింది. ఏజీపీఎల్ చెల్లించిన రూ.2.95 కోట్లను వడ్డీతో కలిపి 4 వారాల్లో తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

