శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘విష్ణు విన్యాసం’. నయన్సారిక కథానాయిక. యదునాథ్ మారుతీరావు దర్శకుడు. సుమంత్ నాయుడు.జి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని శనివారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో కలర్ఫుల్ చొక్కా, క్లాసిక్ బైక్పై విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనిపిస్తున్న శ్రీవిష్ణుని చూడొచ్చు. ఇందులో జాతకాలను నమ్మే విచిత్రమైన యువకుడిగా శ్రీవిష్ణు కనిపిస్తారని, ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: రాధన్, సమర్పణ: హేమ, షాలిని, నిర్మాణం: శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్.