మందోప్య మందతామేతి సంసర్గేణ విపశ్చితః
పంకచ్ఛిదః ఫలస్వేవ నికషేణావిలం పయః॥
ఇడుపుగింజ (చిల్లగింజ) కలవడం వల్ల బురదనీరు నిర్మలమైనట్లు పండితుని సహవాసము వల్ల మందుడు కూడా జ్ఞాని కాగలడు. సామాజిక జీవితంలో సహవాసమే చాలాసార్లు మనిషి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది. అందుకే మంచి వారి సావాసంతోనే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని పొంది మంచి పనులతో ఉన్నతిని, సామాజిక గౌరవాన్ని పొందుతాడు.
టి.సుధాకరశర్మ