రైతునిట్లా
గాలికొదిలేస్తారా
అన్నందుకే
నోరు పారేసుకుంటున్నారు!
ఢిల్లీ
చెవిటిదేం కాదు
గల్లీ తన పేరెత్తినందుకే
నటిస్తున్నది!
దేశం
ఆకలితో అలమటిస్తుందన్నా
త్రేన్చుడే కాని
తేల్చడం లేదు!
భూమికి
విలువొచ్చినా
రైతు కష్టం తన ఉత్పత్తే
నిత్య వివాదం!
అన్నం
పెట్టే వాడూ
చేయి చాపి అడగాలా?
కడుపుకేం తింటున్నరు?!
మూడు పూటలు
తింటున్నది నిజమైతే
మా కల్లాలు
ఖాళీ చేయించండి!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261