ప్రజలపై మళ్లీ గ్యాస్ పిడుగు
పండుగల ముంగిట కేంద్రం ప్రజలపై మరో పిడుగు వేసింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.62.59 మేర పెంచింది. గత నెలలోనే రూ.9.50 మేర పెంచిన కేంద్రం తాజాగా మళ్లీ వడ్డించింది. గృహ అవసరాలకు వినియోగించే దేశీయ ఎల్పీజీ ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర లీటర్‌కు రూ.16 చొప్పున పెరిగింది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.121 నుంచి రూ.137కు పెంచినట్టు చమురు కంపెనీలు వివరించాయి.
- పండుగల ముంగిట కేంద్రం వాత
- వాణిజ్య సిలిండర్‌పై 62.50 పెంపు
- ఏటీఎఫ్ లీటర్‌కు 16 పెరుగుదల
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పండుగల ముంగిట కేంద్రం ప్రజలపై మరో పిడుగు వేసింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.62.59 మేర పెంచింది. గత నెలలోనే రూ.9.50 మేర పెంచిన కేంద్రం తాజాగా మళ్లీ వడ్డించింది. గృహ అవసరాలకు వినియోగించే దేశీయ ఎల్పీజీ ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర లీటర్‌కు రూ.16 చొప్పున పెరిగింది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.121 నుంచి రూ.137కు పెంచినట్టు చమురు కంపెనీలు వివరించాయి. ఆగస్టులో లీటర్‌కు రూ.5 పెంపు తర్వాత సెప్టెంబర్‌లో ఏటీఎఫ్ ధరలను లీటర్‌కు రూ.6.28 లేదా 5.46 శాతం పెంచిన నేపథ్యంలో ఈ తాజా సవరణ జరిగింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్ వాటా 40 శాతం వరకు ఉంటుంది. కాబట్టి ఇంధన ధరలు ఆ సంస్థలకు ఒక కీలకమైన వ్యయ అంశంగా ఉంటాయి. కాగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.
ఎల్పీజీ బుకింగ్‌కు ఆధార్ఈ-కేవైసీ తప్పనిసరి
ఆధార్-ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులు గురువారం నుంచి(అక్టోబర్ 1) నుంచి నిర్ణీత ధరకు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోలేరు. దీనికి బదులుగా ఆ వినియోగదారులు 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ(ఎఫ్టీఎల్) లేదా 10 కిలోల కాంపోజిట్ ఫైబర్ సిలిండర్లను కొనుగోలు చేసే లేదా రీఫిల్ చేయించుకునే అవకాశం ఉంటుందని సబంధిత వర్గాల సమాచారం. వర్తించే సబ్సిడీతో నియంత్రిత రిటైల్ అమ్మకపు ధరకు సిలిండర్లు కొనే ఎల్పీజీ వినియోగదారులకు ఇప్పుడు బయోమెట్రిక్-ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అనే కొత్త నిబంధన గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన వినియోగదారులు యథావిధిగా గృహ వినియోగ ఎల్పీజీ రీఫిల్స్‌ను పొందుతూనే ఉంటారు. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారు నిర్ణీత ధరకు 14.2 కిలోల సిలిండర్‌ను బుక్ చేసుకోలేరు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

