ఆ.వె.॥ ఆంగ్ల వర్ష మొచ్చె యానంద మివ్వగా
జగతి జనుల కెల్ల ప్రగతి జూప
స్వాగతమనరండి సరదాగ జనులంత
జయము మీకు కలుగు జగతిలోన
జయము లేని నాడు జగమంత శూన్యము
ప్రగతి లేని నాడు ప్రజలు లేరు
జనులు లేని నాడు జగమంత చీకటే
చీకటింటి బ్రతుకు చింతలుండు
చింత లున్న బ్రతుకు చిగురించ లేదయా
చిగురు లేని నాడు చీకటేను
వెలుగు లేని బ్రతుకు వెతలతో నిండును
వెతలు యున్న నాడు వెలుగు లేదు
-జాధవ్ పుండలిక్ రావు పాటిల్ ,94413 33315