వేల కోట్ల కాంట్రాక్టుల కట్నం ముట్టిందని
భుజాన కండువా మార్చి
గెలిపించినోళ్ల నోట్ల మన్నుకొట్టి
ఢిల్లీ గులాంలకు అమ్ముడువోయి.
పేదోళ్లను పిచ్చోళ్లను చేసి..
చెవ్వుల్ల పువ్వులు పెట్టుకుంటా..
బజార్ల తిరుక్కుంట ఓట్లు అడుగుతాంటే..
గ్యాస్ ధరలు పెంచినోళ్లు
మా గల్మల అడుగువెట్టద్దని ఒకరు…
ఏండ్ల సంది మా నీళ్ల గోస తీర్చనోళ్లు ఇయ్యాల
మల్ల గెలిసొచ్చి కన్నీళ్లు తూడ్తమని చెప్పే
ఊసరవెల్లులను అసెంబ్లీల
అడుగువెట్టనియ్యమని ఇంకొకరు
నీ రాజకీయ నోటు ఇక చెల్లదని..
మనోడని ఓటెత్తే మునుగోడునే ముంచిండని..
పదవులతో ఇల్లు దిద్దుకున్నడని
మా గల్లికేం చేయలేదని…
మా గడ్డ మీద కారే పోవాలే
కేసీఆర్ సారే రావాలని
గులాబీ జెండే ఎగరాలని..
సర్కార్ బడిపిల్లల నుంచి..
ఆసరా పింఛను తీస్కొనే
అవ్వ దాన్క వాళ్ల గోడు చెప్పుకుంట..
కాళ్ళల కట్టె వెట్టే కాషాయాన్ని
మునుగోడంత గెదుముతాండ్రు..
పాలించే పథకాల పాలనకే మా ఓటని..
ఓటరంటే అభివృద్ధిని ఆశించే దేశ పౌరుడని..
అసొంటి పాలన మా చంద్రశేఖరుడిదని..
ఈ గడ్డ మీద గులాబీనే గెలిపిస్తామని
అంటున్నరు మునుగోడు బిడ్డలు..!
-తుమ్మల కల్పనారెడ్డి , 96404 62142